గోవధ చట్టాన్ని ఎత్తివేయాలని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కౌంటరిచ్చారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతీయులను కించపర్చేలా చెన్నకేశవరెడ్డి వ్యాఖ్యలున్నాయన్నారు.
అమరావతి: గోవధ చట్టాన్ని రద్దు చేయాలని వైసీపీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కౌంటరిచ్చారు.ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. గోమాంసం తినడాన్ని ప్రోత్సహిస్తారా అని ఆయన ప్రశ్నించారు. భారతీయులను కించపర్చేలా మాట్లాడడం దుర్మార్గమన్నారు. ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గోమాంసం తినడాన్ని ప్రోత్సహిస్తారా అని ఆయన ప్రశ్నించారు
also read:గోవధ చట్టాన్ని ఎత్తివేయాలి: వైసీపీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి సంచలనం
దేవాలయాలు ధ్వంసం చేసినవారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.వైసీపీది కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందన్నారు. గోవధ చట్టాన్ని ఎత్తివేయాలని తీర్మాణాలు చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. టిప్పు సుల్తాన్ విగ్రహాలు పెట్టేందుకు అనుమతులిస్తారా అని ఆయన అడిగారు.గోవులను చంపి తినడాన్ని ఎలా సమర్ధిస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారుఓట్ల కోసం వైసీపీ ఈ రకంగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. ఓట్ల కోసం కాకుండా దేశ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకొనేలా వ్యవహరించాలని ఆయన కోరారు.