పోలవరంపై రాష్ట్రం తప్పుడు లెక్కలిస్తోంది

First Published Dec 16, 2017, 5:55 PM IST
Highlights
  • భాజపా నేత పురంధేశ్వరి పోలవరం ప్రాజెక్టు వ్యయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

భాజపా నేత పురంధేశ్వరి పోలవరం ప్రాజెక్టు వ్యయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.  శనివారం కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న పురంధేశ్వరి మీడియాతో మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వానివి తప్పుడు లెక్కలంటూ ఆరోపించారు.  కేంద్రానికి సరైన లెక్కలు పంపకుండానే అవసరమైన నిధులు విడుదల చేయటం లేదని కేంద్రంపై నిందలు వేయడం సరికాదని మండిపడ్డారు. టిడిపి తమకు ప్రతిపక్షమా? మిత్రపక్షమా? అనేది ముఖ్యం కాదని, సరైన లెక్కలు పంపటం లేదన్నదే తమ పాయింటన్నారు. కేంద్రానికి సరైన లెక్కలు పంపితే తక్షణమే కేంద్రం నిధులు ఇస్తుందన్నారు. కేంద్రం ఏపీకి అన్యాయం చేస్తోందనడం సరికాదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా బదులు ఈఏపీ ప్రాజెక్టు ద్వారా నిధులు ఇస్తోందని పురందరేశ్వరి తెలిపారు. గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు.

click me!