టీడీపీలోకి కిషోర్ చంద్రదేవ్: కాంగ్రెస్ టిక్కెట్టుకు కూతురు ధరఖాస్తు

Published : Feb 12, 2019, 05:47 PM IST
టీడీపీలోకి కిషోర్ చంద్రదేవ్: కాంగ్రెస్ టిక్కెట్టుకు కూతురు ధరఖాస్తు

సారాంశం

మాజీ కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్ కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారు. అయితే ఆయన కూతురు శృతీ దేవీ కాంగ్రెస్ పార్టీ  తరపున పోటీ చేసేందుకు టిక్కెట్టు కోసం ధరఖాస్తు చేసుకోవడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకొంది.


విజయనగరం:   మాజీ కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్ కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారు. అయితే ఆయన కూతురు శృతీ దేవీ కాంగ్రెస్ పార్టీ  తరపున పోటీ చేసేందుకు టిక్కెట్టు కోసం ధరఖాస్తు చేసుకోవడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకొంది.

సుధీర్ఘకాలం పాటు కిషోర్ చంద్రదేవ్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇటీవలనే ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. మంగళవారం నాడు ఆయన న్యూఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో భేటీ అయ్యారు.ఈ భేటీ తర్వాత టీడీపీలో చేరుతానని కూడ ఆయన తేల్చి చెప్పారు.

కిషోర్ చంద్రదేవ్ కు కొడుకు, కూతురు ఉన్నారు. కొడుకు వ్యాపారంలో స్థిర పడ్డారు. కూతరు ఢిల్లీలో లా చదువుతున్నారు. ఆమె ఢిల్లీ నుండి  తరచూ జిల్లాకు వచ్చి పోతుంటారు. పర్యావరణ రక్షణ కోసం ఆమె పలు కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. 

కేంద్ర మంత్రిగా కిషోర్ చంద్రదేవ్ పనిచేశారు. పార్వతీపురం, అరకు ఎంపీ స్థానాల నుండి ఆయన విజయం సాధించారు. 2014లో  రాష్ట్ర విభజన సమయంలో కిషోర్ చంద్రదేవ్ కేంద్ర మంత్రిగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో ఆయన వైసీపీ అభ్యర్థి కొత్తపల్లి గీత చేతిలోఓటమి పాలయ్యారు.

ఇటీవలనే ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. టీడీపీలో చేరనున్నట్టు ప్రకటించారు. ఇదిలా ఉంటే కిషోర్ చంద్రదేవ్ కూతురు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు కోసం ధరఖాస్తు చేయడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

వచ్చే ఎన్నికల్లో  కిషోర్ చంద్రదేవ్ కూతురు ఏ స్థానం నుండి పోటీ చేస్తారు, కాంగ్రెస్ పార్టీ ఆమెకు టిక్కెట్టు ఇస్తోందా అనే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

టీడీపీలో చేరుతా: చంద్రబాబుతో భేటీ తర్వాత కిషోర్ చంద్రదేవ్

చంద్రబాబుతో కిషోర్ చంద్రదేవ్ భేటీ: టీడీపీలోకే...

పవన్‌ కళ్యాణ్ ఎఫెక్ట్: సీపీఎంలోకి కిషోర్ చంద్రదేవ్?

కాంగ్రెస్‌కు కిషోర్ చంద్రదేవ్ రాజీనామా: సైకిలెక్కుతారా?

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : ఓవైపు చలి, మరోవైపు వర్షాలు... ఆ ప్రాంతాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త..!
Deputy CM Pawan Kalyan: కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ సమావేశంలో పవన్ కీలక ప్రసంగం | Asianet News Telugu