విశాఖలో పసికందుల అక్రమరవాణా... తల్లిదండ్రులను మోసగించి రూ.13లక్షలకు బిడ్డ విక్రయం

Published : Aug 06, 2020, 07:41 PM ISTUpdated : Aug 06, 2020, 07:44 PM IST
విశాఖలో పసికందుల అక్రమరవాణా... తల్లిదండ్రులను మోసగించి రూ.13లక్షలకు బిడ్డ విక్రయం

సారాంశం

విశాఖ నగర పోలీస్ కమీషనర్ ఆర్కే మీనా పిల్లల అక్రమరవాణా కేసుకు సంబంధించి కీలక విషయాలను వెల్లడించారు. 

విశాఖపట్నం: విశాఖలో చిన్నారులను అక్రమ రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. యూనివర్సల్ సృష్టి హాస్పిటల్ ఎండీ నమ్రత ఆధ్వర్యంలో చిన్నపిల్లల అమ్మకాలు జరుగుతున్నట్టు గుర్తించిన పోలీసులు హాస్పిటల్ ఎండీ నమ్రతను అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 

విశాఖ నగర పోలీస్ కమీషనర్ ఆర్కే మీనా పిల్లల అక్రమరవాణా కేసుకు సంబంధించి కీలక విషయాలను వెల్లడించారు.  సృష్టి యూనివర్సల్ ఆసుపత్రికి నగరంలోని పద్మజ ఆసుపత్రితో లింకులున్నట్లు తెలిసి ఈ రెండు హాస్పిటల్స్ కు సంబంధించిన వ్యవహారాలపై దర్యాప్తు చేసినట్లు తెలిపారు. క్లిష్టమైన డెలివరీ కేసులను డాక్టర్ నమ్రత డాక్టర్ పద్మజ కు రిఫర్ చేసేదని తేలిందన్నారు. 

''ఇలా గ్రామీణ ప్రాంతాల నుంచి కాన్పు కోసం వచ్చిన ఓ డెలవరీ కేసును నమ్రత పద్మజ హాస్పిటల్ కు అప్పగించింది.  డాక్టర్ నమ్రత సూచనలు మేరకు పుట్టిన బిడ్డను చనిపోయినట్లు ఆసుపత్రి సిబ్బంది తల్లిని, కుటుంబసభ్యులను నమ్మించారు. అనంతరం ఆ బిడ్డ సరోగసి ద్వారా పుట్టినట్లు రికార్డు సృష్టించి విజయనగరంకు చెందిన దంపతులుకు రూ.13 లక్షలకు విక్రయించారు'' అని సిపి వెల్లడించారు.

దీంతో ఈ కేసులో మరో ఇద్దర్ని అరెస్టు చేసినట్లు సిపి వెల్లడించారు. డాక్టర్ పద్మజ, ఆశావర్కర్ నూకరత్నంను అరెస్టు చేసినట్లు  తెలిపారు. దీంతో సృష్టి పసిపిల్లల ఆక్రమ రవాణా కేసులో అరెస్టుల సంఖ్య  8కి చేరింది. 

read more   హైదరాబాదులోనూ నమ్రత మోసాల బాగోతం: దంపతుల ఫిర్యాదు

పిల్లలను పోషించే స్థితిలో లేని తల్లి దండ్రులను టార్గెట్ చేసి ఈ అమ్మకాలు చేస్తున్నట్టు తేలింది. తల్లి తండ్రులకు ముందుగానే అడ్వాన్స్ ఇచ్చి పుట్టిన తరవాత పిల్లలను తరలిస్తున్నట్టు గుర్తించారు. విశాఖపట్టణంలోని యూనివర్సల్ సృష్టి ఆసుపత్రిలో ఈ ఏడాది జనవరి నుండి ఇప్పటివరకు 56 పసిపిల్లలను విక్రయించినట్టుగా పోలీసులు గుర్తించారు.  

విశాఖపట్టణంలోని సీతమ్మధారలోని పద్మజ ఆసుపత్రిలో కూడ పిల్లల అక్రమ రవాణా చోటు చేసుకొన్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ ఆసుపత్రిలో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆసుపత్రి నుండి కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకొన్నారు. వీటి ఆధారంగా విచారణ జరిపి తాజాగా డాక్టర్ పద్మజను అరెస్ట్ చేశారు. 

PREV
click me!

Recommended Stories

నెల్లూరు మేయర్ గా భారీ విజయం సాధించిన రూప్ కుమార్ యాదవ్ | Roop Kumar Yadav Wins Big as Nellore Mayor
Pawan Kalyan : పవన్ 100% స్ట్రైక్ రేట్ ఫామ్ కంటిన్యూ.. జనసేన గెలిచిన స్థానాలివే, విజేతలు వీళ్లే