కారులో ఆటలు: డోర్ లాక్, ఊపిరాడక ముగ్గురు చిన్నారులు దుర్మరణం

Siva Kodati |  
Published : Aug 06, 2020, 07:15 PM IST
కారులో ఆటలు: డోర్ లాక్, ఊపిరాడక ముగ్గురు చిన్నారులు దుర్మరణం

సారాంశం

కృష్ణా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కారు డోర్ లాక్ ‌కావడంతో అందులోనే ఉన్న ముగ్గురు చిన్నారులు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు

కృష్ణా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కారు డోర్ లాక్ ‌కావడంతో అందులోనే ఉన్న ముగ్గురు చిన్నారులు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. బాపులపాడు మండలం రేమల్లెలోని మోహన్ స్ప్రింటెక్స్ కంపెనీ క్వార్టర్స్‌లో ఈ ఘటన జరిగింది.

గురువారం మధ్యాహ్నం సమయంలో ముగ్గురు బాలికలు ఆడుకుంటూ ఇంటి బయట పార్క్ చేసి వున్న కారులోకి ఎక్కారు. తిరిగి బయటకొచ్చేందుకు ప్రయత్నించారు. అయితే డోర్ లాక్ కావడంతో బయటకు రావడం సాధ్యపడలేదు.

తల్లిదండ్రులు ఎంత వెతికినా పిల్లలు కనిపించలేదు. చివరికి కారులో చూడగా.. ముగ్గురు చిన్నారులు విగత జీవులుగా కనిపించారు. ఆ స్థితిలో వారిని చూసిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Kandula Durgesh Super Speech: Amarajeevi Jaladhara Scheme Foundation Ceremony | Asianet News Telugu
Chandrababu Naidu Interacts with School Students | Chandrababu Visit Schools | Asianet News Telugu