శ్రీశైలం ఆలయ గౌరవాన్ని కాపాడాలి: అధికారులు, వ్యాపారులతో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి భేటీ

Published : Mar 31, 2022, 02:50 PM ISTUpdated : Mar 31, 2022, 02:58 PM IST
 శ్రీశైలం ఆలయ గౌరవాన్ని కాపాడాలి: అధికారులు, వ్యాపారులతో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి భేటీ

సారాంశం

శ్రీశైలంలో కన్నడ భక్తులకు, స్థానిక వ్యాపారుల మధ్య చోటు చేసుకొన్న ఘర్షణకు సంబంధించి ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఆరా తీశారు. వ్యాపారులు, అధికారులతో ఈ విషయమై ఆయన చర్చించారు. ఆలయ గౌరవాన్ని కాపాడాలని కోరారు.

శ్రీశైలం:  Srisailam Temple లో Kannada భక్తులకు స్థానికంగా ఉన్న వ్యాపారులకు మధ్య చోటు చేసుకొన్న ఘర్షణపై ఎమ్మెల్యే Shilpa Chakrapani Reddyస్పందించారు.

గురువారం నాడు  ఆలయ అధికారులు, వ్యాపారులతో  ఈ విషయ,మై ఎమ్మెల్యే శిల్ప చక్రపాణిరెడ్డి చర్చించారు. శ్రీశైలంలోని Tea దుకాణంలో వాటర్ బాటిల్ ను అధిక ధరలకు విక్రయిస్తున్నారనే విషయమై కన్నడ devotees కు, టీ దుకాణం  యజమానికి  మధ్య చోటు చేసుకొన్న వివాదం పెద్ద ఘర్షణకు దారి తీసింది. టీ దుకాణానికి కన్నడ భక్తులు నిప్పు పెట్టారు. దీంతో స్థానిక దుకాణదారుల దాడిలో కన్నడ భక్తులకు చెందిన వాహనాలు ధ్వంసమయ్యాయి. మరో వైపు ఓ కన్నడ భక్తుడు కూడా గాయపడ్డారు.అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.శ్రీశైలంలో  ఘర్షణకు సంబంధించిన విషయమై ఎమ్మెల్యే  శిల్ప చక్రపాణిరెడ్డి ఆరా తీశారు. అసలు ఏం జరిగిందనే విషయమై ఎమ్మెల్యే పోలీసులను అడిగి తెలుసుకొన్నారు.

శ్రీశైలంలో ఆలయం వద్ద భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు జరగకుండా చూడాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. శ్రీశైలం ఆలయ పవిత్రతతో పాటు గౌరవాన్ని కూడా కాపాడాలని ఆయన కోరారు. ఈ మేరకు ప్రతి ఒక్కరూ కూడా తమ వంతు సహకారాన్ని అందించాలన్నారు.

శ్రీశైలంలో ఉన్న దుకాణాల్లో వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలున్నాయని డీఎస్పీ శృతి ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఆయా దుకాణాల వద్ద వస్తువుల ధరల పట్టికలు ఏర్పాటు చేయాలని కూడా ఆలయ ఈవో లవన్న వ్యాపారులను ఆదేశించారు. 

శ్రీశైలంలో ఉగాదిని పురస్కరించుకొని నిర్వహించే ఉత్సవాలకు కర్ణాటకతో పాటు మహారాష్ట్ర నుండి పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. కన్నడ భక్తులకు స్థానికంగా ఉన్న టీ దుకాణ యజమానికి మధ్య ఘర్షణను పురస్కరించుకొని కన్నడ భక్తులు శ్రీశైలంలో వీరంగం సృష్టించారు. తాత్కాలిక దుకాణాలను ధ్వంసం చేశారు. స్థానిక దుకాణ యజమానులు కూడా కన్నడ భక్తులపై వారి వాహనాలపై దాడులకు దిగారు.

కరోనా నేపథ్యంలో గత రెండేళ్ల నుండి శ్రీశైలంలో  ఉగాది ఉత్సవాలకు భక్తులను అనుమతించలేదు. ఈ ఏడాది కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఈ దఫా భక్తులకు అనుమతిని ఇచ్చారు. దీంతో కర్ణాటక నుండి పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. సాధారణంగా శ్రీశైలం ఆలయానికి కర్ణాటక నుండి పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. కర్ణాటక నుండి భక్తులు కాలినడకన కూడా శ్రీశైలం ఆలయానికి వస్తుంటారు.

PREV
click me!

Recommended Stories

Pawan Kalyan with “Tiger of Martial Arts” Title: టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ బిరుదు| Asianet Telugu
Raghurama krishnam raju: ఘట్టమనేని ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే RRR స్పీచ్| Asianet News Telugu