నిండుకుండలా శ్రీశైలం జలాశయం...మరోసారి గేట్లను ఎత్తిన అధికారులు (వీడియో)

By Arun Kumar PFirst Published Sep 11, 2020, 1:21 PM IST
Highlights

6 గేట్లను 10 అడుగల మేర ఎత్తి శ్రీశైలం జలాశయం నుండి నీటిని కిందకు వదిలుతున్నారు అధికారులు.

కర్నూలు: శ్రీశైలం జలాశయంలోకి ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 6 గేట్లను 10 అడుగల మేర ఎత్తి నీటిని కిందకు వదిలుతున్నారు అధికారులు.  ప్రస్తుతం ఈప్రాజెక్టు ఇన్‌ఫ్లో 1,98,239 క్యూసెక్కులుగా వుండగా ఔట్ ఫ్లో 1,42,700 క్యూసెక్కులుగా వుంది. 

వీడియో

"

ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం జలాశయంలో 884.80 అడుగుల మేర నీరు వుంది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలకు గాను ప్రస్తుతం 214.8450 టీఎంసీలకి నీటిమట్టం చేరింది. ప్రస్తుతం కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి  కొనసాగుతోంది. 

click me!