టీటీడీ అనుబంధ ఆలయాల్లో కరోనా కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. కరోనా కారణంగా శ్రీనివాసమంగాపురం ఆలయాన్ని మూసివేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలో పనిచేసే 18 మంది అర్చకులకు ఇప్పటికే కరోనా సోకిన విషయం తెలిసింది. ఇంకా కొందరి ఫలితాలు రావాల్సి ఉంది
తిరుపతి: టీటీడీ అనుబంధ ఆలయాల్లో కరోనా కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. కరోనా కారణంగా శ్రీనివాసమంగాపురం ఆలయాన్ని మూసివేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలో పనిచేసే 18 మంది అర్చకులకు ఇప్పటికే కరోనా సోకిన విషయం తెలిసింది. ఇంకా కొందరి ఫలితాలు రావాల్సి ఉంది.
టీటీడీకి అనుబంధంగా తిరుచానూరు పద్మావతి ఆలయంలో కూడ కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. ఈ ఆలయానికి అనుబంధంగా ఉన్న పోటులో సిబ్బందికి కరోనా సోకింది. దీంతో పోటును ఆలయ పరిసర ప్రాంతాలను శానిటైజ్ చేస్తున్నారు. ఈ ఆలయాన్ని మూసివేయాలా వద్దా అనే విషయమై కూడ అధికారులు చర్చిస్తున్నారు.
undefined
నిన్న శ్రీనివాసమంగాపురంలో రెండు పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఆలయాన్ని మూసివేశారు. అర్చకులు, పోటు సిబ్బందిని కూడ కరోనా టెస్టులు చేయించుకోవాలని టీటీడీ అధికారులు ఆదేశించారు.గతంలో తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో పనిచేసే వ్యక్తికి కూడ కరోనా సోకింది. తిరుమల శ్రీవారి ఆలయంలో పనిచేసే అర్చకులు 18 మందికి కరోనా సోకింది. ఇంకా కొందరి ఫలితాలు రావాల్సి ఉంది.
also read:రమణదీక్షితులు వ్యాఖ్యలకు వైవీ సుబ్బారెడ్డి కౌంటర్
టీటీడీలో పనిచేసే సుమారు 170 మందికి కరోనా సోకింది. పెద్ద జీయంగారికి కూడ కరోనా సోకింది. మెరుగైన చికిత్స కోసం ఆయనను చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
కరోనా నేపథ్యంలో తిరుమలలో దర్శనాలు నిలిపివేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ విషయమై ఇంకా టీటీడీ నిర్ణయం తీసుకోలేదు. కరోనా నేపథ్యంలో తిరుమలలో భక్తులకు దర్శనాలను నిలిపివేయాలని టీటీడీ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం జగన్ కు ట్విట్టర్ వేదికగా ఫిర్యాదు చేశారు.