ప్రేమ వివాదం: విజయవాడలో యువతి మేనమామ హత్య

Published : Apr 20, 2023, 09:29 AM IST
ప్రేమ వివాదం: విజయవాడలో  యువతి మేనమామ హత్య

సారాంశం

ప్రేమ వ్యహరం  విజయవాడలో  ఒకరి హత్యకు  దారి తీసింది.  ఈ విషయమై   పోలీసులు  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు  చేస్తున్నారు.   

విజయవాడ: ప్రేమ వ్యవహరం  విజయవాడలో  ఒకరి   హత్యకు దారి తీసింది. ఈ ఘటనపై  విజయవాడ  సత్యనారాయణపురం పోలీీసులు  కేసు నమోదు  చేసుకొని దర్యాప్తు  చేస్తున్నారు. 

ఒంగోలుకు చెందిన  మైనర్ బాలిక  విజయవాడకు  చెందిన  నవీన్ అనే యువకుడి మధ్య  కొంత కాలంగా  ప్రేమ వ్యవహరం సాగుతుంది.  రెండు రోజుల క్రితం  మైనర్ బాలిక  విజయవాడలోని  నవీన్ ఇంటికి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న   బాలిక  బంధువులు  నవీన్  ఇంటికి వచ్చారు.    ఈ విషయమై  నవీన్  కుటుంబ సభ్యులతో  బాలిక   కుటుంబ సభ్యులతో  మాట్లాడుతున్న సమయంలో  వివాదం  చెలరేడింది.

 ఇరువర్గాల మధ్య  మాటా మాటా పెరిగింది. దీంతో  ఆగ్రహం తట్టుకోలేకనవీన్  బాలిక  మేనమామ శ్రీనివాస్ పై కత్తితో గురువారంనాడు  దాడికి దిగాడు.  ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన  శ్రీనివాస్ ను  ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే  శ్రీనివాస్ మృతి చెందాడు.  

also read:బ్లేడ్‌తో కోసుకొని , ఆపై హత్య:చిత్తూరు కొండమిట్ట దుర్గా ప్రశాంతి హత్యలో కీలక విషయాలు

ఇదిలా ఉంటే  బాలిక  ప్రస్తుతం  కన్పించకుండా  పోయింది.  ఈ విషయమై   ఇరువర్గాల మధ్య  గొడవ జరిగిందని  చెబుతున్నారు.   యువతి  కుటుంబ సభ్యులే  ఆమెను తీసుకెళ్లి  తిరిగి  తమ ఇంటికి  వచ్చి  ప్రశ్నించడంతో  గొడవ  జరిగిందని  నవీన్  కుటుంబ సభ్యులు  చెబుతున్నారు. అయితే రెండు వర్గాల మధ్య  ఘర్షణకు దారి తీసిన  కారణాలు ఏమిటి,   శ్రీనివాస్ హత్యకు  దారితీసిన  పరిస్థితులపై  పోలీసులు ఆరా తీస్తున్నారు.  సంఘటన స్థలాన్ని  పోలీసులు పరిశీలించారు.  నవీన్  కుటుంబసభ్యులతో  పాటు   బాలిక  కుటుంబ సభ్యులను  పోలీసులు ప్రశ్నిస్తున్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetables Price : వీకెండ్ మార్కెట్స్ లో ఏ కూరగాయ ధర ఎంత..?
IMD Rain Alert : ఈ రెండ్రోజులు వర్ష బీభత్సమే... ఈ ప్రాంతాలకు పొంచివున్న ప్రమాదం