ర్యాష్ డ్రైవింగ్:భీమవరంలో కానిస్టేబుల్ పై డ్రైవర్ దాడి, కేసు

By narsimha lode  |  First Published May 3, 2022, 2:33 PM IST


పశ్చిమ గోదావరి జిల్లాలో ర్యాష్ డ్రైవింగ్ కు పాల్పడిన శ్రీనివాస్ ను ఆపిన ట్రాఫిక్ కానిస్టేబుల్ కుమార్ పై శ్రీనివాస్ దాడికి దిగాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
 


ఏలూరు: West Godavari జిల్లాలో ర్యాష్ డ్రైవింగ్ నిర్వహిస్తున్న Driver ను ఆపినందుకు Constableపై ఆ వ్యక్తి దాడికి దిగాడు. విచక్షణరహితంగా కానిస్టేబుల్ పై దాడి చేశాడు.  ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

పశ్చిమ గోదావరి జిల్లాలోని Bhimavaramకి చెందిన Srinivas కారును అతి వేగంగా నడుపుతున్నాడు.ఈ విషయాన్ని గమనించిన ట్రాపిక్ కానిస్టేబుల్ కారును ఆపాడు. అయితే కానిస్టేబుల్ కారు ఆపుతున్నా శ్రీనివాస్  కారును కొద్ది దూరంలో ఆపాడు.  

Latest Videos

అయితే శ్రీనివాస్ మద్యం తాగాడా అనే విషయమై కానిస్టేబుల్ పరీక్ష నిర్వహించాడు. ఈ సమయంలోనే ట్రాఫిక్ కానిస్టేబుల్ kumar పై శ్రీనివాస్ దాడికి దిగాడు.  శ్రీనివాస్ విచక్షణ రహితంగా కానిస్టేబుల్ కుమార్ పై Attack చేశారు. కానిస్టేబుల్ కుమార్ కూడా ప్రతిఘటించారు.

అయితే ఈ దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ దృశ్యాలు వైరల్ గా మారాయి.. తనపై దాడి చేసిన శ్రీనివాస్ ను కానిస్టేబుల్ కుమార్ స్థానికుల సహాయంతో పోలీస్ స్టేషన్ కు తరలించారు. కానిస్టేబుల్ పై దాడి చేసిన శ్రీనివాస్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.
 

click me!