అరకులో విషాదం.. సర్వీస్ వైర్ మీద బట్టలారేస్తుంటే కరెంట్ షాక్.. భార్యాభర్తలు మృతి...

Published : May 03, 2022, 01:17 PM IST
అరకులో విషాదం.. సర్వీస్ వైర్ మీద బట్టలారేస్తుంటే కరెంట్ షాక్.. భార్యాభర్తలు మృతి...

సారాంశం

సర్వీస్ వైర్ మీద బట్టలు ఆరేయబోయాడో భర్త.. అది కాస్తా కరెంట్ షాక్ రావడంతో గిలగిలా కొట్టుకుంటున్నాడు. అది చూసి భార్య కాపాడబోయింది. ఆమెకూ షాక్ తగిలి ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. 

అరకు : Alluri Sitaramaraj District అరకులోయలో విషాదం చోటు చేసుకుంది. Service wire మీద దుస్తులు ఆరేస్తుండగా దంపతులు మృతి చెందారు. భర్తను కాపాడే ప్రయత్నంలో భార్యకు Electric shock కొట్టింది. అరకులోయలోని విద్యుత్ ఉద్యోగుల క్వార్టర్స్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. విద్యుదాఘాతంతో దంపతులు స్పృహ కోల్పోయారు. పరిస్థితిని గమనించిన స్తానికులు 108కు కాల్ చేశారు. అంబులెన్స్ రాక ఆలస్యం కావడంతో భార్యాభర్తలు మృతి చెందినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. 

కాగా, ఈ జనవరిలో బల్లార్షలో కరెంట్ షాక్ ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. కలకాలం కలిసి ఉంటానని మాట ఇచ్చిన భర్తే.. Current shock ఇచ్చి,, ఆపై axeతో నరికి అర్ధాంగిని కర్కశంగా కడతేర్చాడు. ఈ పైశాచిక ఘటన మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లా గోండ్ పిప్రీ తాలూకా బంగారం తడోదిలో జరిగింది. గడ్చిరోలి ఠాణా ఇన్స్పెక్టర్ జీవన్ రాజగురు తెలిపిన వివరాల మేరకు…  బంగారం తడోది గ్రామానికి చెందిన రాజు భావనే (43), యోగిత (35) దంపతులు.  వీరికి ఒక కుమారుడు ఓంకార్ (14).

శనివారం భార్యాభర్తల మధ్య జరిగిన చిన్న Dispute చినికి చినికి గాలివాన అయ్యింది. ఈ నేపథ్యంలో భార్యను అంతమొందించాలని రాజు పన్నాగం పన్నాడు. ఈ మేరకు ఆదివారం వేకువజామున నిద్రిస్తున్న ఆమెను లేపి.. హాలులోకి తీసుకువచ్చి.. నిర్బంధించాడు. ఆ తరువాత విద్యుత్ తీగల సహాయంతో కరెంట్ షాక్ ఇచ్చాడు.

అయినా భార్య ప్రాణం పోకపోవడంతో.. పక్కనే ఉన్న గొడ్డలితో అత్యంత పాశవికంగా ఆమె మెడపైన.. తల పైన నరికి హతమార్చాడు.  ఆ తరువాత వెంటనే పురుగుల మందు తాగి తానూ Suicide కు ప్రయత్నించాడు. అయితే.. ఈ క్రమంలో తల్లి వేసిన కేకలకు పక్కగదిలో నిద్రిస్తున్న కుమారుడు మేలుకున్నాడు.

అతడు గట్టిగా అరవడంతో ఇరుగుపొరుగు వారు పరుగున వచ్చారు. దంపతులిద్దరిని గోండ్ పిప్రీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే భార్య యోగిత మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. భర్త రాజుకు చికిత్స అందిస్తున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు ప్రకటించారు. 

ఇక జనవరి 27న ఆంధ్రప్రదేశ్ లో ఓ వ్యక్తి ఆగి ఉన్న goods train పైకెక్కి selfie తీసుకుంటుండగా current shockకి గరై యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. పిడుగురాళ్ల పట్టణ రైల్వే స్టేషన్ శివారులో బుధవారం ఈ ఘటన జరిగింది. పట్టణానికి చెందిన కటికం వీరబ్రహ్మం రైల్వేస్టేషన్ సమీపంలో నివసిస్తున్నాడు. తన బైక్ మీద రైల్వేస్టేషన్ వద్దకు వచ్చాడు. అప్పటికే గూడ్స్ రైలు ఆగి ఉండటంతో వెనుక బోగీపైకి ఎక్కాడు.

బోగీపై నిలబడి సెల్ఫీ దిగేందుకు చేతిని పైకి లేపడంతో పైన ఉన్న హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలి విద్యుదాఘాతానికి కింద పడ్డాడు. కిందపడటంతో తలకు గాయం కావడంతోపాటు, శరీరం కూడా తగలబడుతోంది.. ఇది చూసిన అక్కడే ఉన్న మరో యువకుడు బుచ్చయ్య గమనించి వెంటనే రైల్వేస్టేషన్ మాస్టర్ కృపాకర్ కు సమాచారం ఇచ్చాడు. రైల్వే ఎస్ఐ ఐలయ్య, ఏఎస్ఐ కె. క్రీస్తుదాసు, కానిస్టేబుల్ సురేష్ లు ఘటన స్థలానికి చేరుకుని మంటలార్పారు. బాధితుడిని 108లో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu
Deputy CM Pawan Kalyan Speech: ఆరడుగుల బుల్లెట్ నేను కాదురఘురామ పై పవన్ పంచ్ లు | Asianet Telugu