కూతురు లవ్ మ్యారేజ్: గన్నవరంలో తల్లి ఆత్మహత్య

Published : Jul 08, 2021, 10:57 AM IST
కూతురు లవ్ మ్యారేజ్: గన్నవరంలో తల్లి ఆత్మహత్య

సారాంశం

కూతురు ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకోవడంతో తల్లి ఆత్మహత్య చేసుకొంది. కృష్ణా జిల్లా గన్నవరంలో ఈ ఘటన జరిగింది. సూసైడ్ లెటర్  తల్లి శ్రీలక్ష్మి తన ఆవేదనను పొందుపర్చింది.   


గన్నవరం: కూతురు ప్రేమ వివాహం చేసుకొందనే వేదనతో తల్లి ఆత్మహత్య చేసుకొంది. ఆత్మహత్య చేసుకొనే మందు ఆమె రాసిన సూసైడ్ లేఖలో  తన ఆవేదనను ఆమె పొందుపర్చారు.కృష్ణా జిల్లాకు చెందిన సుస్మిత అనే యువతి  టీసీఎస్ లో సాఫ్ట్‌వేర్  ఇంజనీర్ గా పనిచేస్తోంది.   ఆమె ఇటీవలనే ప్రేమ వివాహం చేసుకొంది. ప్రేమ వివాహం చేసుకోవడంతో  తల్లి  శ్రీలక్ష్మి మనస్థాపానికి గురైంది.  

ఆత్మహత్య చేసుకొనేముందు ఆమె తన వేదనను  లేఖ రూపంలో రాసింది.  తతను ఎవరూ కూడ గుర్తుపట్టకుండా ఉండాలనే ఉద్దేశ్యంతోనే గన్నవరం వచ్చి ఆత్మహత్య చేసుకొంది.  తల్లి అనే పదానికి కూడ విలువ లేదని సూసైడ్ లేఖలో  పేర్కొనడం గమనార్హం. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.శ్రీలలక్ష్మి ఆత్మహత్యకు  కూతురు ప్రేమ వివాహమే కారణమా ఇంకా ఏమైనా కారణాలున్నాయా అనే కోణంలో కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్