
కడప: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక్క రోజు భోజనం మానేస్తే రూ.30 కోట్ల ఖర్చా వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు ఇటీవల చేపట్టిన దీక్షపై ఆయన గురువారం ఆ విధంగా వ్యాఖ్యానించారు.
బిజెపి నాయకుడికి చెందిన భార్యకు పదవి ఇవ్వవచ్చునా అని ఆయన చంద్రబాబును ప్రశ్నించారు. నిత్యం బీసి జపం చేసే చంద్రబాబు బీసీలను అవమానించే విధంగా లేఖలు రాశారని ఆయన అన్నారు.
ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచినప్పుడు గవర్నర్ వ్యవస్థను చంద్రబాబు స్వార్థం కోసం వాడుకున్నారని, ఇప్పుడు గవర్నర్ వ్యవస్థను తప్పు పడుతున్నారని ఆయన అన్నారు. మారాల్సింది గవర్నర్ వ్యవస్థ కాదని, స్పీకర్ వ్యవస్థ అని, స్పీకర్ పచ్చ కుండువా కప్పుకుని సైకిల్ యాత్రలో పాల్గొన్నారని ఆయన అన్నారు.
తప్పులు చేయకపోతే చంద్రబాబు ప్రజల రక్షణ కోరడం ఎందుకని ఆయన అడిగారు. హమీలు నెరవేర్చనందుకు 60 దీక్షదీక్షలు చేసినా పాపం పోదని ఆయన అన్నారు. టిడీపికి, బిజెపికి మధ్య సంబంధాలు చెడిపోతే తమ పార్టీకి అండగడుతున్నారని ఆయన అన్నారు.