నేను ఏ తప్పూ చేయలేదు.. బాధితురాలే కావాలని ఇలా : శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్

By Siva KodatiFirst Published Oct 4, 2022, 6:12 PM IST
Highlights

శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై జాతీయ మహిళా కమీషన్ సీరియస్‌ కావడంతో అంజూ యాదవ్ స్పందించారు. 

శ్రీకాళహస్తి సీఐ వ్యవహారశైలిపై జాతీయ మహిళా కమీషన్ సీరియస్ అయ్యింది. సీఐపై తక్షణం ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేయాలని ఏపీ డీజీపీని కమీషన్ ఆదేశించింది. ఇప్పటికే సీఐ అంజూ యాదవ్‌ను విచారించారు ఎస్పీ. కావాలని దాడి చేయలేదంటూ సీఐ ఆడియో విడుదల చేశారు. తను ఏ తప్పూ చేయలేదని.. బాధితురాలు మర్యాదగా మాట్లాడలేదని అంజూ యాదవ్ అన్నారు. ఆమెను తాను ఎక్కడా కొట్టలేదని ఆమె స్పష్టం చేశారు. కావాలనే బాధితురాలు ఇలా చేస్తోందని సీఐ ఆరోపించారు. 

అసలేం జరిగిందంటే..?

శ్రీకాళహస్తి వన్ టౌన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అంజు యాదవ్.. ఒక నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు తన సిబ్బందితో కలిసిపట్టణంలోని రాంనగర్ కాలనీకి చేరుకున్నారు. అయితే అక్కడ అతడు లేకపోవడంతో..  అంజు యాదవ్ అతని భార్య ధనలక్ష్మిని ప్రశ్నించారు. ఆమెపై శారీరకంగా దాడి చేశారు. అతడు ఎక్కడ ఉన్నాడో సమాచారం చెప్పాలంటూ బెదిరింపులకు దిగారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.  ఆ వీడియోలో అంజు యాదవ్.. ధనలక్ష్మిని దూషిస్తూ, అక్కడే నిలిపి ఉన్న పోలీసు వాహనంలోకి బలవంతంగా ఎక్కించారు. అయితే సీఐ అంజు యాదవ్.. తనను తన్నినట్టుగా బాధిత మహిళ ధనలక్ష్మి ఆరోపించారు. తనకు ఇంతుకు ముందు ఆపరేషన్ జరిగినట్టుగా  చెప్పారు. 

ALso REad:శ్రీకాళహస్తిలో మహిళా సీఐ తీరుపై జాతీయ మహిళా కమిషన్‌ సీరియస్‌.. చర్యలు తీసుకోవాలని డీజీపీకి లేఖ

ఈ ఘటనపై ఏపీ పోలీసులను ప్రశ్నించిన వంగలపూడి అనిత.. కఠిన చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్‌ను కోరారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై పోలీసుల దౌర్జన్యాలు. మహిళా పోలీసులను ఉపయోగించి ప్రతిపక్ష పార్టీలకు చెందిన మహిళలపై క్రూరంగా దాడులు చేస్తున్నారు.దయ చేసి కఠిన చర్యలు తీసుకోండి’’ అని జాతీయ మహిళా కమిషన్‌, జాతీయ మానవ హక్కుల సంఘం లను ట్యాగ్ చేస్తూ అనిత ట్వీట్ చేశారు. ఈ క్రమంలోనే జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. 
 

click me!