‘‘రైతుల ముసుగులో ఫేక్ యాత్రికులు’’... అమరావతి రైతుల పాదయాత్రకు వ్యతిరేకంగా పోస్టర్లు, కలకలం

By Siva KodatiFirst Published Oct 4, 2022, 3:18 PM IST
Highlights

అమరావతిని ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు నిర్వహిస్తోన్న మహా పాదయాత్ర తాడేపల్లిగూడెనికి చేరుకుంది. ఈ క్రమంలో పాదయాత్రకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలియడం కలకలం రేపుతోంది. 

అమరావతిని ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు మహా పాదయాత్ర నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం నుంచి అనుమతులు రాకున్నా, మంత్రులు విమర్శలు చేస్తున్నా రైతులు వెనకడుగు వేయడం లేదు. కొన్ని ప్రాంతాల్లో రైతులకు ఘన స్వాగతం లభిస్తూ వుంటే.. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కృష్ణా జిల్లా గుడివాడలో రైతుల పాదయాత్ర ఉద్రిక్తతకు దారి తీసిన సంగతి తెలిసిందే.

తాజాగా ఈ యాత్ర ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో ఫ్లెక్సీల వార్ నెలకొంది. కొందరు ఈ పాదయాత్రకు స్వాగతం పలుకుతూ బ్యానర్లు ఏర్పాటు చేయగా.. మరికొందరు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు కట్టారు. ‘‘గో బ్యాక్ ఫేక్ యాత్రికులు’’ అంటూ అందులో రాత లున్నాయి. రైతుల ముసుగులోని ఫేక్ యాత్రికులు గో బ్యాక్ అంటూ రెచ్చగొట్టే నినాదాలను రాశారు. మరోవైపు పాదయాత్రను వ్యతిరేకిస్తూ వెలిసిన ఫెక్సీలపై రాజధాని రైతులు, టీడీపీ, జనసేన నేతలు మండిపడుతున్నారు. 

ALso REad:రైతుల పాదయాత్రను ముందుకు వెళ్లనివ్వకూడదు.. దుర్మార్గులను అడ్డుకోవాల్సిందే : బొత్స సంచలనం

ఇకపోతే.. మహా పాదయాత్రను ఉద్దేశిస్తూ మంత్రి బొత్స సత్యనారాయణ శనివారం ఘాటు వ్యాఖ్యలు చేశారు. రైతుల పాదయాత్ర ఒక్క అడుగు ముందుకు వేయకుండా అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. దుష్టశక్తులు, దుర్మార్గులను అడ్డుకోవాల్సిన అవసరం వుందని బొత్స పేర్కొన్నారు. బీజేపీ నేతలు రాజధాని విశాఖకు వ్యతిరేకంగా స్టేట్‌మెంట్ ఇస్తున్నారని మంత్రి మండిపడ్డారు. బీజేపీ నేతలు ద్వంద వైఖరి అవలంభిస్తున్నారని... వికేంద్రీకరణే తమ ప్రభుత్వ విధానమని బొత్స స్పష్టం చేశారు. మేనిఫెస్టోలో వికేంద్రీకరణకు సంబంధించిన అంశాలను పెట్టామని.. బొత్స సత్యనారాయణ వెల్లడించారు. 29 గ్రామాలు, ఒక ప్రాంతం, వర్గం కోసం ప్రభుత్వం ఆలోచించదని మంత్రి పేర్కొన్నారు. శివరామకృష్ణన్ కమిటీకి గత ప్రభుత్వం కో ఆపరేట్ చేయలేదని..ఆ కమిటీ గత ప్రభుత్వం నిర్ణయం సరైనది కాదని చెప్పిందని బొత్స గుర్తుచేశారు. రైతుల ముసుగులో టీడీపీ చేస్తున్న పాదయాత్రకు బుద్ధి చెప్పాలని మంత్రి పిలుపునిచ్చారు. 
 

click me!