బాలయ్య షోకు చంద్రబాబు.. సీఎం.. సీఎం.. అంటూ సెట్‌లో ఫ్యాన్స్ రచ్చ.. వైరల్ అవుతున్న వీడియో

Published : Oct 04, 2022, 03:31 PM ISTUpdated : Oct 04, 2022, 03:42 PM IST
బాలయ్య షోకు చంద్రబాబు.. సీఎం.. సీఎం.. అంటూ సెట్‌లో ఫ్యాన్స్ రచ్చ.. వైరల్ అవుతున్న వీడియో

సారాంశం

ప్రముఖ సినీనటుడు, హిందుపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించిన అన్​స్టాపబుల్ ఓటీటీ షో గ్రాండ్ సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. త్వరలోనే అన్​స్టాపబుల్ సీజన్-2 కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ప్రముఖ సినీనటుడు, హిందుపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించిన అన్​స్టాపబుల్ ఓటీటీ షో గ్రాండ్ సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ షోతో బాలకృష్ణలోని మరో కోణం కూడా బయటకు వచ్చిందని అభిమానులు చెబుతుంటారు. ఇప్పుడు అన్​స్టాపబుల్ సీజన్-2 ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమవుతుంది. అన్​స్టాపబుల్ సీజన్-1 తొలి ఎపిసోడ్‌కు మోహన్ బాబు గెస్ట్‌గా రాగా, చివరి ఎపిసోడ్‌లో మహేష్ బాబు గెస్ట్‌గా వచ్చారు. ఈ సీజన్ మొత్తం సందడిగా సాగడం, విపరీతమైన ప్రేక్షక ఆదరణ దక్కడంతో సీజన్-2 గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సీజన్-2లో ఎవరెవరూ గెస్ట్‌లుగా వస్తారనే చర్చ కూడా జోరుగా సాగింది. 

ఇప్పటికే అన్​స్టాపబుల్ సీజన్-2కు ప్రోమో షూట్ పూర్తికాగా... నేడు విజయవాడలో ఈ టాక్ షో టీజర్‌ను విడుదల చేయనున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సీజన్‌ తొలి ఎపిసోడ్‌కు గెస్ట్‌గా.. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వచ్చారు. ఇందుకు సంబంధించిన షూట్ కూడా ఇప్పటికే పూర్తి అయినట్టుగా తెలుస్తోంది.  ఈ ఎపిసోడ్ మధ్యలో చంద్రబాబు తనయుడు లోకేష్ కూడా జాయిన్ అవ్వనున్నట్టుగా సమాచారం.

 

 

 

ఇక, అన్​స్టాపబుల్ సెట్ వద్ద బాలకృష్ణతో చంద్రబాబు కలిసి ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అలాగే అన్​స్టాపబుల్ సెట్‌లో బాలకృష్ణతో కలిసి చంద్రబాబు.. అక్కడికి వచ్చిన అభిమానులకు అభివాదం చేస్తున్న వీడియో కూడా తెగ వైరల్ అవుతుంది. చంద్రబాబు అభివాదం చేస్తున్న సమయంలో.. షోకు వచ్చిన అభిమానులు సీఎం.. సీఎం.. అంటూ నినాదాలు చేశారు. ఈ వీడియోను షేర్ చేస్తున్న టీడీపీ శ్రేణులు, నందమూరి బాలకృష్ణ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.2019లో ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే రానున్న ఎన్నికల్లో ఎలాగైనా టీడీపీని అధికారంలోకి తీసుకురావాలని చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Venkaiah Naidu Strong Remarks on Freebies: రాజకీయ పార్టీలను జనం ప్రశ్నించాలి | Asianet News Telugu
Jogi Ramesh Serious:ఆమాటలు వెనక్కుతీసుకోపోతే..రాధాకృష్ణకు బుద్ది చెప్పేతీరుతాం | Asianet News Telugu