శ్రీకాళహస్తి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

By Siva KodatiFirst Published Mar 26, 2024, 7:11 PM IST
Highlights

దక్షిణకాశీగా పేరొందిన శ్రీకాళహస్తి రాజకీయంగానూ హీట్ పుట్టిస్తోంది. 2019 ముందు వరకు శ్రీకాళహస్తిలో టీడీపీ , కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్లుగా తలపడేవి. కాంగ్రెస్ పార్టీ 6 సార్లు, టీడీపీ 7 సార్లు, వైసీపీ ఒకసారి, స్వతంత్రులు రెండు సార్లు విజయం సాధించారు. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఇక్కడి నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగానూ సేవలందించారు. రెడ్డి సామాజికవర్గానికి చెందినవారే ఎక్కువగా గెలుస్తూ వస్తున్నారు.  శ్రీకాళహస్తిపై పట్టు కోల్పోకూడదని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. దీనిలో భాగంగా సిట్టింగ్ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డికి టికెట్ కేటాయించారు. బొజ్జల కుమారుడు సుధీర్ రెడ్డికే టికెట్ కేటాయించారు చంద్రబాబు. 

శ్రీకాళహస్తి .. ఈ పేరు వినగానే పంచ భూత లింగాల్లో ఒకటైన వాయు లింగం గుర్తొస్తుంది. దక్షిణకాశీగా పేరొందిన శ్రీకాళహస్తి రాజకీయంగానూ హీట్ పుట్టిస్తోంది. ఈ నియోజకవర్గంలో బీసీలు, బలిజ ఓటర్లు ఎక్కువ. వారు ఎటు వైపు మొగ్గు చూపితే ఆ పార్టీదే విజయం. అయినప్పటికీ రెడ్డి సామాజికవర్గానికి చెందినవారే ఎక్కువగా గెలుస్తూ వస్తున్నారు. 2019 ముందు వరకు శ్రీకాళహస్తిలో టీడీపీ , కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్లుగా తలపడేవి. 1952లో ఏర్పడిన ఈ సెగ్మెంట్ పరిధిలో రేణిగుంట, ఏర్పేడు, శ్రీకాళహస్తి, తొట్టంబేడు మండలాలున్నాయి. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 2,37,666 మంది. 

శ్రీకాళహస్తి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 .. కాంగ్రెస్, టీడీపీలకు కంచుకోట :

కాంగ్రెస్ పార్టీ 6 సార్లు, టీడీపీ 7 సార్లు, వైసీపీ ఒకసారి, స్వతంత్రులు రెండు సార్లు విజయం సాధించారు. దివంగత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఇక్కడి నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగానూ సేవలందించారు.  అద్దూరు బాలరామిరెడ్డి రెండు సార్లు కాంగ్రెస్ టికెట్‌పై , ఒకసారి ఇండిపెండెంట్‌గా విజయం సాధించారు. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి బియ్యపు మధుసూదన్ రెడ్డికి 1,09,541 ఓట్లు.. టీడీపీ అభ్యర్ధి బొజ్జల సుధీర్ రెడ్డికి 71,400 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా వైపీపీ 38,141 ఓట్ల భారీ మెజారిటీతో  శ్రీకాళహస్తిలో తొలిసారి పాగా వేసింది. 

2024 ఎన్నికల విషయానికి వస్తే.. శ్రీకాళహస్తిపై పట్టు కోల్పోకూడదని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. దీనిలో భాగంగా సిట్టింగ్ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డికి టికెట్ కేటాయించారు. పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు కరోనా వంటి సమయంలో వైసీపీ పథకాలన అమలుపై ఏకంగా నవరత్నాల గుడిని నిర్మించి రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. జగన్ ఆశీస్సులతో పాటు కేడర్ నుంచి కూడా సంపూర్ణ సహకారం అందుతూ వుండటంతో తన విజయం తథ్యమని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

శ్రీకాళహస్తి శాసనసభ ఎన్నికల ఫలితాలు 2024 .. టీడీపీ పుంజుకుంటుందా :

టీడీపీ విషయానికి వస్తే.. శ్రీకాళహస్తి ఆ పార్టీకి కంచుకోట. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి బతికి వున్నంత కాలం తెలుగుదేశానికి నియోజకవర్గంలో ఎదురులేకుండాపోయింది. ఆయన మరణం తర్వాత 2019 ఎన్నికల్లో బొజ్జల కుమారుడు సుధీర్ రెడ్డికే టికెట్ కేటాయించారు చంద్రబాబు. దురదృష్టవశాత్తూ ఆయన ఓడిపోయారు. అయినప్పటికీ 2024లో మరోసారి అవకాశం కల్పించింది హైకమాండ్. తన కుటుంబానికి శ్రీకాళహస్తిలో వున్న పట్టు.. టీడీపీ జనసేన బీజేపీ కూటమి కారణంగా ఈసారి విజయం సాధిస్తానని సుధీర్ ధీమాగా వున్నారు. 
 

click me!