విశాఖ లోక్‌సభ బరిలో బాలయ్య అల్లుడు

By narsimha lodeFirst Published Jan 28, 2019, 5:05 PM IST
Highlights

విశాఖపట్టణం ఎంపీ స్థానం నుండి  దివంగత మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి మనమడు శ్రీభరత్ టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసే అవకాశం ఉంది. శ్రీభరత్  సినీ నటుడు బాలకృష్ణ రెండో అల్లుడు.
 

విశాఖపట్టణం:విశాఖపట్టణం ఎంపీ స్థానం నుండి  దివంగత మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి మనమడు శ్రీభరత్ టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసే అవకాశం ఉంది. శ్రీభరత్  సినీ నటుడు బాలకృష్ణ రెండో అల్లుడు.

విశాఖపట్టణం ఎంపీ స్థానం నుండి  గతంలో రెండు పర్యాయాలు ఎంవీవీఎస్ మూర్తి ఎంపీగా పనిచేశాడు. గత ఏడాది అమెరికా పర్యటనలో ఉన్న సమయంలోనే ఎంవీవీఎస్ మూర్తి మృతి చెందాడు.

ఎంవీవీఎస్ మూర్తి మృతి మనమడు శ్రీభరత్‌ను ఈ స్థానం నుండి వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఎంపీగా పోటీ చేయించే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో ఈ స్థానం నుండి బీజేపీ అభ్యర్థి కంభంపాటి హరిబాబు పోటీ చేసి విజయం సాధించారు. గత ఎన్నికల సమయంలో  టీడీపీ,బీజేపీ మధ్య పొత్తు ఉంది. ఈ పొత్తు కారణంగా విశాఖ ఎంపీ స్థానం బీజేపీకి  కేటాయించింది టీడీపీ.

ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కంభంపాటి హరిబాబు విశాఖ నుండి పోటీ చేసి  విజయం సాధించారు. అయితే ఈ దఫా టీడీపీ బీజేపీతో తెగదెంపులు చేసుకొంది. ఈ తరుణంలో విశాఖ నుండి టీడీపీ అభ్యర్థిగా  శ్రీభరత్‌ను రంగంలోకి దింపనున్నట్టు ప్రచారం సాగుతోంది.

శ్రీభరత్ ప్రస్తుతం గీతం విద్యాసంస్థల అధిపతిగా కొనసాగుతున్నారు.  ఈ స్థానం నుండి  2004, 2009 ఎన్నికల్లో దగ్గుబాటి పురందేశ్వరీ కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. కేంద్ర మంత్రిగా కూడ పురంధేశ్వరీ పని చేశారు.

గత ఎన్నికల సమయంలో పురంధేశ్వరీ బీజేపీలో చేరింది. అయితే ఆమె గత ఎన్నికల సమయంలో  రాజంపేట అభ్యర్ధిగా పోటీ చేసి వైసీపీ అభ్యర్థి మిథున్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.
 

ANN స్పెషల్: ఇవి కాపీ కథలని మీకు తెలుసా?(తెలుగు సినిమాలు) 

 

click me!