కర్నూలులో విషాదం...మైనర్ విద్యార్థిని, హాస్టల్ వార్డెన్ ఆత్మహత్య

Published : Jan 28, 2019, 04:11 PM ISTUpdated : Jan 28, 2019, 04:15 PM IST
కర్నూలులో విషాదం...మైనర్ విద్యార్థిని, హాస్టల్ వార్డెన్ ఆత్మహత్య

సారాంశం

కర్నూలు పట్టణంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని ఓ జూనియర్ కాలేజికి చెందిన హాస్టల్లో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. విద్యార్థిని ఆత్మహత్య తర్వాత కొన్ని గంటల్లోనే హాస్టల్ వార్డన్  బలవన్మరణానికి పాల్పడింది. ఇలా ఒకే కాలేజికి సంబంధించిన ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడటం కర్నూల్ లో సంచలనంగా మారింది. 

ఈ విషాద సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కర్నూల్ పట్టణం శివారులోని నందికొట్కూరు రోడ్డులోని సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజీలో దాక్షాయిని అనే యువతి బైపిసి చదువుతోంది. సీనియర్ ఇంటర్ చదువుతున్న ఈమె కాలేజి హాస్టల్లో వుండేది. అయితే శనివారం రిపబ్లిక్ డే కావడంతో అందరు విద్యార్థినులతో పాటు దాక్షాయిని కూడా హాస్టల్లోనే వుంది. ఈ క్రమంలో ఏమయ్యిందో ఏమో గానీ అర్థరాత్రి సమయంలో హాస్టల్లోనే ఈ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. 

ఈ విషయం గురించి తెలుసుకున్న హాస్టల్ వార్డెన్ పుష్పవతి కళాశాల యాజమాన్యానికి, పోలీసులకు సమాచారం అందించింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

అయితే ఈ ఘటన జరిగిన మరుసటి రోజు(ఆదివారం) తెల్లవారుజామున హాస్టల్ వార్డెన్ పుష్పవతి కనిపించకుండా పోయింది. దీంతో పోలీసులు ఆమె జాడ కోసం గాలించగా... కేసీ కెనాల్‌కు సమీపంలో శవమై కనిపించింది. రక్షణ కోసం ఏర్పాటుచేసిన కంచె పైపుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 

ఇలా కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే ఒకే కాలేజికి చెందిన  విధ్యార్థిని, సిబ్బంది ఆత్మహత్యలు పట్టణంలో కలకలం రేపింది. ఈ ఆత్మహత్యలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వీరిద్దరి ఆత్మహత్యలకు గల సంబంధంపై దర్యాప్తు చేస్తున్నారు.  

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం