
తిరుమల: శ్రీలంక ప్రధాన మంత్రి మహింద రాజపక్సే తన సతీమణి శ్రీమతి Shiranthi Rajapaksa. తో కలిసి శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.ఉదయం ఆలయం వద్దకు చేరుకున్న Sri Lankanప్రధాని Rajapaksaకి TTD జేఈఓవీరబ్రహ్మం, సివిఎస్వో గోపినాథ్ జెట్టి మహద్వారం వద్ద సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం దర్శన ఏర్పాట్లు చేశారు.
శ్రీలంక ప్రధాని శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఆ తరువాత జెఈవో తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటం అందించారు.
also read:శ్రీవారికి వజ్రాలు, కెంపులు పొదిగిన బంగారు వరద-కటి హస్తాలు విరాళం.. విలువ రూ.3 కోట్ల పైనే
తిరుమల శ్రీవారిని దర్శించకొనే సమయంలో శ్రీలంక ప్రధాన మంత్రి రాజపక్సే హుండీలో డబ్బును జమ చేశాడు. శ్రీలంక ప్రధాని 2020 ఫిబ్రవరి మాసంలో శ్రీవారిని దర్శించుకున్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ నారాయణస్వామి, అర్బన్ ఎస్పీ వెంకట అప్పల నాయుడు, ఆలయ డిప్యూటీ ఈవో రమేష్ బాబు, రిసెప్షన్ డెప్యూటీ ఈఓ లోకనాథం తదితరులు పాల్గొన్నారు.