
ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయం ( Srisailam Temple ) లో మరోసారి డ్రోన్లు కలకలం సృష్టించింది. డ్రోన్ విషయంలో భద్రతా వైఫల్యం మరోసారి బయటపడింది. ఆలయం పక్కన ఉన్న పుష్కరిణి వద్ద డ్రోన్‌ను ఎగురుతుండటం చూసి భక్తులు భయాందోళన గురయ్యారు. ఆలయ పుష్కరిణి వద్ద భక్తులు స్నానం చేస్తూ పైన డ్రోన్ ఎగురుతున్న దృశ్యాలను చూసి ఆలయ అధికారులకు సమాచారం అందించారు. దీంతో రంగం లోకి దిగిన భద్రత సిబ్బంది డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. డ్రోన్ ఎగరవేసిన వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఇక ఆలయ పరిసర నిషిధం.. భక్తుల సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు .. డ్రోన్ ను ఆపరేట్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను గుర్తించి .. అదుపులోకి తీసుకున్నారు. నిందితులను ఇద్దరు గుజరాత్ కు చెందిన వారిగా గుర్తించారు. అసలు వారు ఆలయ పరిసరాల్లో డ్రోన్ ఎందుకు ఎగరవేశారు? ఆలయం దగ్గరకు ఎలా తీసుకువచ్చారు? వారికి సహకరించిన వారెవ్వరూ? అసలు ఆలయ సెక్యూరిటీ ఏం చేస్తున్నది ? వారు గుజరాత్ నుండి ఇక్కడికి ఎందుకు వచ్చారు ? అన్న ఇద్దరు నిందితులను కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
Read Also: బూతుల మంత్రితో కొబ్బరిచిప్పల మంత్రి పోటీ...: రామతీర్థం ఘటనపై చంద్రబాబు సీరియస్
ఈ క్రమంలో ఆలయ భద్రతపై భక్తులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. భక్తులు సమాచారమిచ్చేంత వరకు ఆలయ భద్రత సిబ్బంది ఏం చేస్తోంది ? అన్నది పెద్ద ప్రశ్న. ఈ పరిణామం శ్రీశైలంలో భద్రతా వైఫల్యాన్ని కళ్ళకు కట్టింది. భక్తులకు ఉన్నపాటి శ్రద్ధ కూడా ఆలయ భద్రతా సిబ్బందికి లేదన్న టాక్ వినిపిస్తుంది. గతంలోనూ ఇలాంటి ఘటననే జరిగింది. ఆలయ పరిసర ప్రాంతాల్లో డ్రోన్లు సంచరించడం కలకలం రేపింది. ఈ ఏడాది మే నెలలో దాదాపు నాలుగు రోజుల పాటు.. రాత్రి సమయాల్లో శ్రీశైలం శైవక్షేత్రం పై డ్రోన్ కెమెరాలు ఎగరవేయడం అప్పట్లో కలకలం రేపింది. నాలుగు రోజులు శ్రీశైలం ఆలయం చుట్టూ తిరిగిన డ్రోన్లు ఆలయ అధికారులకు ఆందోళన కలిగించాయి. దీంతో ఆలయ అధికారాలు.. పోలీసులను ఆశ్రయించారు. మరో వైపు ప్రతిపక్షాలు రంగంలో దిగాయి. శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ప్రమాదం పొంచి ఉందని , బీజేపీ నేతలు ఈ పుణ్యక్షేత్రాన్ని నో ఫ్లై జోన్ గా ప్రకటించాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. ఆలయ ప్రతిష్ట, భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదముందని అన్నారు.
Read Also: Myanmar Landslide: మయన్మార్‌లో ఘోర ప్రమాదం.. జాడే మైన్‌లో విరిగిపడిన కొండచరియలు.. 70 మంది గల్లంతు
అప్పుడు ఆలయం సమీపంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ క్వార్టర్స్, ఔటర్ రింగ్ రోడ్, మల్లమ్మ కన్నీరు, ఉత్తరా పార్క్, విశ్వామిత్ర మఠం, రిజర్వాయర్ మరియు కొన్ని ఇతర ప్రాంతాల్లో డ్రోన్లు సంచరించినట్టు, ఈ క్రమంలో పలు చిత్రాలను చిత్రీకరించినట్లు అనుమానాలు ఉన్నాయి. అప్పట్లో నల్లమల అటవీ ప్రాంతంలో,అటవీ శాఖ అధికారులతో కలిసి పోలీసులు డ్రోన్లని పట్టుకోవడం కోసం ప్రయత్నాలు చేశారు. కానీ నిందితులను పట్టుకోలేకపోయారు. ఇక తాజాగా మరోమారు డ్రోన్ తో వీడియో చిత్రీకరణ చేస్తున్న క్రమంలో ఇద్దరు పట్టుబడడంతో ఈ వ్యవహారాన్ని పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు .