
ఎర్ర నారాయణ ఏమి మాట్లాడినా సంచలనమే. అదేలేండి సిపిఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు డాక్టర్ కె. నారాయణ. నోట్ల రద్దు విషయంలో మోడిపై విరుచుకుపడ్డారు. పనిలో పనిగా భజన బృందాన్ని కూడా కడిగిపారేసారు. మోడి గురించి మాట్లాడుతూ, గడచిన రెండున్నరేళ్ళలో దేశంలోని కార్పొరేట్ కంపెనీలకు రూ. 5.80 లఓల కోట్లు మోడి దారాదత్తం చేసారని ఆరోపించారు.
ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న మోడిని ప్రజా కోర్టులో గుంజీలు తీయించాలన్నారు. నోట్ల రద్దుకు మూడు నెలల ముందు లెక్కలు తీయిస్తే మోడి చేసిన మొసం బయటపడుతుందని నారాయణ డిమాండ్ చేసారు. వామపక్షాలు నల్లకుభేరులకు మద్దతుగా నిలుస్తున్నట్లు వెంకయ్యనాయడు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. నల్ల కుభేరులెప్పుడో తమ వద్ద ఉన్న నల్లధనాన్ని మార్చేసు కున్నారని నారాయణ ఎద్దేవా చేసారు.
నోట్ల రద్దు చేసేటపుడు ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రత్యామ్నాయాలు చేసివుంటే మోడికి పాలాభిషేకం చేసి ఉండేవారమని కూడా నారాయణ అన్నారు.
నోట్ల రద్దు బ్లాక్ మనీపై సర్జికల్ దాడి కాదని, సామాన్య ప్రజలపై దాడిగా అభివర్ణించారు. చివరగా, ప్రధానమంత్రి సెంటిమెంట్ తో, వెంకయ్యనాయడు బ్లాక్ మైల్తో, తెలుగు ముఖ్యమంత్రులిద్దరూ మోడి భజనతో కాలం గడుపుతున్నట్లు విరుచుకుపడ్డారు.