ఏపీలో భారీ వ‌ర్షాలు, వరదలు: ప్రజా రవాణాపై తీవ్ర ప్రభావం.. పలు రైళ్లు రద్దు

By Siva KodatiFirst Published Nov 19, 2021, 9:49 PM IST
Highlights

భారీ వర్షాలు, వరదలతో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ (floods in andhra pradesh) అల్లాడుతోంది. రోడ్లు, రైల్వే ట్రాకులుపై భారీగా వరద నీరు చేరుతుండటంతో ప్రజా రవాణాకు ఆటంకం ఏర్పడింది. భారీ వ‌ర్షాల కార‌ణంగా ద‌క్షిణ మ‌ధ్య రైల్వే (south central railway) ప‌లు రైళ్ల‌ను ర‌ద్దు చేయగా.. కొన్ని రైళ్ల‌ను దారి మ‌ళ్లించింది

భారీ వర్షాలు, వరదలతో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ (floods in andhra pradesh) అల్లాడుతోంది. రోడ్లు, రైల్వే ట్రాకులుపై భారీగా వరద నీరు చేరుతుండటంతో ప్రజా రవాణాకు ఆటంకం ఏర్పడింది. భారీ వ‌ర్షాల కార‌ణంగా ద‌క్షిణ మ‌ధ్య రైల్వే (south central railway) ప‌లు రైళ్ల‌ను ర‌ద్దు చేయగా.. కొన్ని రైళ్ల‌ను దారి మ‌ళ్లించింది. నంద‌లూరు – రాజంపేట మ‌ధ్య ప‌ట్టాల‌పై నీటి ప్రవాహం ప్ర‌మాద‌క‌రంగా ఉంది.

దారి మ‌ళ్లించిన రైళ్లు:

  • తిరువ‌నంత‌పురం – షాలిమార్, ముంబ‌యి సీఎస్‌టీ – చెన్నై సెంట్ర‌ల్
  • తిరుప‌తి – నిజాముద్దీన్, కాచిగూడ – మంగ‌ళూరు
  • బెంగ‌ళూరు – గువాహ‌టి, చెన్నై సెంట్ర‌ల్ – నిజాముద్దీన్
  • చెన్నై సెంట్ర‌ల్ – హావ్‌డా, చెన్నై సెంట్ర‌ల్ – విజ‌యవాడ‌

ర‌ద్దయిన రైళ్లు:

  • చెన్నై సెంట్ర‌ల్ – ముంబ‌యి సీఎస్‌టీ, గుంత‌క‌ల్లు – రేణిగుంట‌
  • బిట్ర‌గుంట – చెన్నై సెంట్ర‌ల్, చెన్నై సెంట్ర‌ల్ – బిట్ర‌గుంట‌
  • విజ‌యవాడ – చెన్నై సెంట్ర‌ల్, చెన్నై సెంట్ర‌ల్ – విజ‌య‌వాడ‌
  • చెన్నై సెంట్ర‌ల్ – అహ్మ‌దాబాద్, కాచిగూడ – చెంగ‌ల్ప‌ట్టు
  • ఎల్‌టీటీ ముంబ‌యి – చెన్నై సెంట్ర‌ల్
  • ముంబ‌యి సీఎస్‌టీ – నాగ‌ర్‌సోల్, మ‌ధురై – ముంబ‌యి ఎల్‌టీటీ
  • చెంగ‌ల్ప‌ట్టు – కాచిగూడ‌, చెన్నై సెంట్ర‌ల్ – ముంబ‌యి ఎల్‌టీటీ

మరోవైపు భారీ వర్షాలు కడప జిల్లా (kadapa district) రాజంపేటలో (rajampet) తీవ్ర విషాదాన్ని నింపాయి. భారీ ఎత్తున ప్రాణ నష్టం వాటిల్లింది. మూడు ఆర్టీసీ బస్సులు వరద నీటిలో చిక్కుకున్న ఘటనలో  ఇప్పటివరకు 12 మృతదేహాలను వెలికితీశారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నందలూరు పరివాహక ప్రాంతంలోని మందపల్లి, ఆకేపాడు,నందలూరు ప్రాంతంలో మూడు ఆర్టీసీ బస్సులు flood water లో చిక్కుకున్నాయి. ఈ ఘటనలో సుమారు 30 మంది చెయ్యేరు వరద ఉధృతిలో కొట్టుకుపోయారు. ఉదయం నుండి గాలింపు చేపట్టారు. సహాయక సిబ్బంది ఇప్టటి వరకు 12 మృతదేహాలను వెలికి తీశారు. గండ్లూరులో ఏడు, రాయవరంలో 3,  మండపల్లిలో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి.

ALso Read:ఏపీలో భారీ వర్షాలు: చెయ్యేరు నది ఉధృతి, 12 మంది మృతదేహల వెలికితీత

click me!