చంద్రబాబు కంటతడి బాధాకరం... భువనేశ్వరిపై వైసీపీ నేతల వ్యాఖ్యలు ఖండించాల్సిందే: పవన్

By Siva Kodati  |  First Published Nov 19, 2021, 8:18 PM IST

చంద్రబాబు కంటతడి పెట్టడం బాధ కలిగించిందని వ్యాఖ్యానించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఓవైపు రాష్ట్రాన్ని వరదలు (floods) అతలాకుతలం చేస్తుంటే అవేమీ పట్టని ప్రజాప్రతినిధులు ఆమోదయోగ్యంకాని విమర్శలు, వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని పవన్ కల్యాణ్ విమర్శించారు


ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో (ap assembly sessions) తన సతీమణిని అసభ్య పదజాలంతో దూషించారంటూ టీడీపీ (tdp) అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) మీడియా సమావేశంలో కంటతడిపెట్టిన వ్యవహారం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై జనసేన (janasena party) చీఫ్ పవన్ కల్యాణ్ (pawan kalyan) స్పందించారు. తన భార్యను అవమానించారని, ఆమె గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లేలా మాట్లాడారని చంద్రబాబు కంటతడి పెట్టడం బాధ కలిగించిందని వ్యాఖ్యానించారు.

ఓవైపు రాష్ట్రాన్ని వరదలు (floods) అతలాకుతలం చేస్తుంటే అవేమీ పట్టని ప్రజాప్రతినిధులు ఆమోదయోగ్యంకాని విమర్శలు, వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని పవన్ కల్యాణ్ విమర్శించారు. ఇటీవల కాలంలో సభలు, సమావేశాలు, ఆఖరికి టీవీ చానళ్ల చర్చా కార్యక్రమాల్లో వాడుతున్న పదజాలం సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉందని పవన్ పేర్కొన్నారు. తాజాగా ఏపీ శాసనసభలో విపక్ష నేత కుటుంబ సభ్యులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అత్యంత శోచనీయమని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. 

Latest Videos

ALso Read:Chandrababu Naidu: ప్రెస్‌మీట్‌లో బోరున విలపించిన చంద్రబాబు నాయుడు.. వెక్కి వెక్కి ఏడ్చిన వైనం

గతంలో సీఎం జగన్ (ys jagan mohan reddy) కుటుంబ సభ్యులను కూడా కొందరు తక్కువచేసి మాట్లాడినప్పుడు తాను ఖండించిన విషయాన్ని పవన్ గుర్తుచేశారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు మహిళల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలని జనసేనాని హితవు పలికారు. మహిళల గౌరవమర్యాదలకు హాని కలిగించే ధోరణులను జనసేన పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఇటువంటి దిగజారుడు రాజకీయాలను ఖండించాలని, లేకపోతే ఒక అంటువ్యాధిలా వ్యాపించే అవకాశం వుందని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. 

కాగా... ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్న సంగతి తెలిసిందే. శుక్రవారం అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరడం తెలిసిందే. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును, ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ వైసీపీ (ysrcp) నేతలు చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనికి నొచ్చుకున్న చంద్రబాబు... మళ్లీ సీఎం అయిన తర్వాతే అసెంబ్లీలో అడుగుపెడతానంటూ శపథం చేశారు. ఆ తర్వాత ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు.  

click me!