South Central Railway: భద్రతా పనుల కారణంగా పలు రైళ్ల రద్దు.. వివరాలు ఇవిగో

By Mahesh Rajamoni  |  First Published Nov 5, 2023, 12:33 AM IST

South Central Railway: రైలు నంబర్ 17240 విశాఖపట్నం-గుంటూరు సింహాద్రి ఎక్స్‌ప్రెస్ కొన్ని భద్రతా పనుల కారణంగా నవంబర్ 7 నుండి నవంబర్ 13 వరకు తాత్కాలికంగా రద్దు చేశారు. దీంతో పాటు మరికొన్ని రైలు స‌ర్వీసుల‌ను తాత్కాలికంగా ర‌ద్దు చేస్తున్న‌ట్టు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే విజ‌య‌వాడ డివిజ‌న్ అధికారులు ప్ర‌క‌టించారు.
 


Visakhapatnam: అవసరమైన భద్రతా పనుల కారణంగా దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్‌లో పలు రైళ్ల సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేశారు. ప్రయాణికులు ఈ విష‌యాన్ని దృష్టిలో ఉంచుకుని త‌మ ప్రయాణాల‌ను ప్లాన్ చేసుకోవాల‌ని సంబంధిత అధికారులు సూచించారు. ద‌క్షిణ మ‌ధ్య రైల్వే విజ‌య‌వాడ డివిజ‌న్ ప్ర‌క‌టించిన రైద్దు చేయ‌బ‌డిన రైళ్ల వివ‌రాలు ఇలా ఉన్నాయి.. 

1. రైలు నంబ‌ర్ 17239 గుంటూరు-విశాఖపట్నం సింహాద్రి ఎక్స్‌ప్రెస్: గుంటూరు నుండి విశాఖపట్నం మార్గంలో న‌డుస్తుంది. దీని స‌ర్వీసుల‌ను నవంబర్ 6 నుండి నవంబర్ 12 వరకు ర‌ద్దు చేస్తున్న‌ట్టు రైల్వే అధికారులు తెలిపారు.

Latest Videos

undefined

2. రైలు నెంబ‌ర్ 17240 విశాఖపట్నం-గుంటూరు సింహాద్రి ఎక్స్‌ప్రెస్: విశాఖపట్నం నుండి గుంటూరు మ‌ధ్య న‌డుస్తుంది. ఈ ట్రైన్ సేవ‌లు నవంబర్ 7 నుండి నవంబర్ 13 వరకు ర‌ద్దు చేశారు. 

3. రైలు నెంబ‌ర్ 07466 రాజమండ్రి-విశాఖపట్నం మెము స్పెషల్ ఎక్స్‌ప్రెస్: రాజమండ్రి నుండి విశాఖపట్నం మ‌ధ్య న‌డుస్తుంది. నవంబర్ 6 నుండి నవంబర్ 12 వరకు ఈ రైలు సేవ‌లు ర‌ద్దు చేశారు.

4. రైలు నెంబ‌ర్  07467 విశాఖపట్నం-రాజమండ్రి మెము స్పెషల్ ఎక్స్‌ప్రెస్: విశాఖపట్నం నుండి రాజమండ్రి రూట్ లో న‌డిచే ఈ రైలు సేవ‌లు నవంబర్ 6 నుండి నవంబర్ 12 వరకు తాత్కాలికంగా నిలిపివేస్తున్న‌ట్టు రైల్వే అధికార వ‌ర్గాలు తెలిపాయి.

click me!