రండి, కలిసి లంచ్ చేద్దాం.. ఎంపీ రామ్మోహన్ ను సోనూ సూద్ ఆహ్వానం..

Published : May 13, 2021, 10:30 AM ISTUpdated : May 13, 2021, 10:43 AM IST
రండి, కలిసి లంచ్ చేద్దాం.. ఎంపీ రామ్మోహన్ ను సోనూ సూద్ ఆహ్వానం..

సారాంశం

శ్రీకాకుళం : ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడును రియల్ హీరో సోనూ సూద్ లంచ్ కు ఆహ్వానించారు. ఇటీవల శ్రీకాకుళం నగరానికి చెందిన యువకుడు తయారు చేసిన సోనూ సూద్ చిత్రాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ..సోనూ సేవలను ఎంపీ అభినందించిన విషయం తెలిసిందే.   

శ్రీకాకుళం : ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడును రియల్ హీరో సోనూ సూద్ లంచ్ కు ఆహ్వానించారు. ఇటీవల శ్రీకాకుళం నగరానికి చెందిన యువకుడు తయారు చేసిన సోనూ సూద్ చిత్రాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ..సోనూ సేవలను ఎంపీ అభినందించిన విషయం తెలిసిందే. 

దీనికి స్పందించిన సోనూ.. ఆ యువకుడిని తీసుకోని మీరు లంచ్ కి రావాలని ఆహ్వానిస్తూ ట్విట్టర్లో సోనూ సూద్ విజ్ఞప్తి చేశారు.

కాగా మనిషి తలుచుకుంటే ఏదైనా చేయచ్చు.. ఎంతటి కష్టమైనా సాధించవచ్చు అని నిరూపిస్తున్నాడు రియల్ హీరో సోనూసూద్. ఏకంగా ఆక్సీజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసి.. దేశంలో ఆక్సీజన్ కొరత తీర్చాలని నడుంబిగించారు సోనూసూద్. ప్రభుత్వాలు చేయాల్సిన పనుల్ని స్వయంగా తన భుజానికెత్తుకున్నారాయన. 

ఇప్పటికే ఎందరో కోవిడ్ బాధితులకు అండగా నిలిచిన సోనూ మరో అడుగు ముందుకేశారు. ఆక్సిజన్ అందక ప్రాణాలు విడుస్తున్న వారిని చూసి చలించిన సోనూసూద్ ఇకపై అలా జరగకుండా ఉండేందుకు ఆక్సిజన్ ప్లాంట్ లను నెలకొల్పేందుకు సిద్ధమయ్యారు.

హ్యాట్సాఫ్ సోనూసూద్.. దేశవ్యాప్తంగా ఆక్సీజన్ ప్లాంట్ల ఏర్పాటుతో మరో ముందడుగు.. !...

ముందుగా నాలుగు ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారాయన. ఫ్రాన్స్ తో పాటు ఇతర దేశాల నుంచి వీటిని కొనుగోలు చేస్తున్నారు.  ఢిల్లీ, మహారాష్ట్రతో పాటు కేసులు అధికంగా ఉన్న ఇతర రాష్ట్రాల్లో వీటిని ఏర్పాటు చేయబోతున్నారు.

తొలి ప్లాంట్ ఫ్రాన్స్ నుంచి మరో పది రోజుల్లో ఇండియాకు రానుంది. ఆక్సీజన్ సిలిండర్లు అందుబాటులో లేకపోవడం వల్ల చాలామంది బాధపడుతున్నారు. దాంతో ఇప్పటికే కొన్ని చోట్ల సిలిండర్లు ఏర్పాటుచేశాం.

అయితే ఆక్సిజన్ ప్లాంట్ల వల్లనే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్నా. సమయమే మనకు అతి పెద్ద సవాలు. ప్రతిదీ సమయానికి అందించేలా మా వంతు కృషి చేస్తున్నామని.. సోనుసూద్ తెలిపారు. 
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం