ఏపీలో రెండు రోడ్డు ప్రమాదాలు... ఆరుగురి మృతి

Published : May 13, 2021, 08:21 AM ISTUpdated : May 13, 2021, 08:24 AM IST
ఏపీలో రెండు రోడ్డు ప్రమాదాలు... ఆరుగురి మృతి

సారాంశం

రోడ్డు ప్రమాదాల్లో మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఓ రోడ్డు ప్రమాదం తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకోగా.. మరో రోడ్డు ప్రమాదం ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. 

రెండు వేర్వేరు జిల్లాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఓ రోడ్డు ప్రమాదం తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకోగా.. మరో రోడ్డు ప్రమాదం ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. ఈ రెండు ఘటనలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తూర్పుగోదావరి జిల్లాలోని పెద్దాపురం ఏడీబీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని కారు ఢీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ఇరుక్కున్న ఐదుగురిలో నలుగురు మృతి చెందగా..లారీలో, కారులో ఇరుక్కున్న క్షతగాత్రులను దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. తాళ్ళరేవు మండలం పెద్దవలస  నుంచి రాజమండ్రి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

ప్రకాశం జిల్లా అద్దంకి శివారు గరటయ్య కాలనీ సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. కూలీలతో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇద్దరు మహిళా కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా...మరో 10 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

PREV
click me!

Recommended Stories

Visakha Express Women Incident: కదులుతున్న రైలులో ఘోరం మహిళపై ఏసీ కోచ్‌ బాయ్.. | Asianet News Telugu
vidadala rajini: రెడ్ బుక్.. బ్లడ్ బుక్‌గా మారింది లోకేశ్ పై రెచ్చిపోయిన విడదల రజిని| Asianet Telugu