అక్రమ బంధానికి అడ్డుగా వున్నాడని... కన్నతండ్రినే కడతేర్చిన కసాయి కొడుకు

Arun Kumar P   | Asianet News
Published : Jun 24, 2021, 09:37 AM IST
అక్రమ బంధానికి అడ్డుగా వున్నాడని... కన్నతండ్రినే కడతేర్చిన కసాయి కొడుకు

సారాంశం

 భార్యా బిడ్డలు వుండగా వేరే మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్న కొడుకు బుద్దిచెప్పాలనుకుని చూసిన తండ్రి అదే కొడుకు చేతిలో ప్రాణాలు కోల్పోయాడు.

గుంటూరు: చెడుమార్గంలో వెళుతూ సంసారాన్ని పాడుచేసుకుంటున్న కొడుకును మందలించడమే ఆ తండ్రి ప్రాణాలమీదకు తెచ్చింది. భార్యా బిడ్డలు వుండగా వేరే మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్న కొడుకుకు తండ్రి బుద్దిచెప్పాలని చూశాడు. కానీ ఆ కొడుకు మాత్రం తననూ, ప్రియురాలిని విడదీయాలని చూస్తున్నాడని భావించి ఏకంగా తండ్రినే అతికిరాతకంగా హతమార్చాడు. ఈ దారుణం గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.  

ఈ హత్యకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లా ఏటీ అగ్రహారానికి చెందిన పిల్లలమర్రి శివానందరామం(72) పౌరోహిత్యం చేస్తుండేవాడు. అతడి భార్య, చిన్న కొడుకు కొన్నేళ్ల క్రితమే చనిపోయింది. దీంతో పెద్ద కొడుకు వంశీమోహన్ వద్దే వుండేవాడు. అయితే కొడుకుతో విబేధాలు రావడంతో అతడు ఒక్కడే వేరుగా వుండేవాడు. 

read more  ప్రియుడ్ని కట్టేసి యువతిపై గ్యాంగ్ రేప్ కేసు: ముప్పు తిప్పలు పెడుతున్న కృష్ణ

అయితే వంశీమోహన్ వేరే మహిళతో అక్రమసంబంధాన్ని పెట్టుకుని భార్యా పిల్లలను నిర్లక్ష్యం చేస్తున్నట్లు శివానందంకు తెలిసింది. దీంతో అతడు తన కొడుకుకు దూరంగా వుండాలని మహిళను హెచ్చరించాడు. ఈ విషయం వంశీమోహన్ కు తెలిసి తండ్రితో గొడవపడ్డాడు. ఈ క్రమంలోనే తండ్రిపై అతి కిరాతకంగా దాడిచేసి హతమార్చినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.  

తండ్రిని చంపి ఈ విషయం బయటపడకుండా వంశీమోహన్ కొత్త నాటకానికి తెరతీశాడు. అర్థరాత్రి తండ్రి బాడీని స్మశానవాటికకు తీసుకెళ్లి కాటికాపరికి అప్పగించి అంత్యక్రియలు చేయాలని చెప్పి వెళ్లిపోయాడు. దీంతో కాపరికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో పోలీసులు మ్రుతదేహంపై గాయాలుండటంతో విచారణ జరపగా అసలు నిజం బయటపడింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు వంశీమోహన్ ను అరెస్ట్ చేశారు. 

PREV
click me!

Recommended Stories

Nimmala Ramanaidu: ఈ రిజర్వాయర్ల భూ సేకరణలో జగన్ రైతులకు ఏం చేశారో తెలుసా? | Asianet News Telugu
టీడీపీ బతుకంతా కాపీ పేస్టే.. Gudivada Amarnath Comments on Bhogapuram Airport | Asianet News Telugu