జగన్ ప్రభుత్వానికి షాక్ : తెలంగాణ లేఖపై కృష్ణ రివర్ మెనేజ్ మెంట్ ఆదేశాలు

Published : Jun 24, 2021, 09:13 AM IST
జగన్ ప్రభుత్వానికి షాక్ : తెలంగాణ లేఖపై కృష్ణ రివర్ మెనేజ్ మెంట్ ఆదేశాలు

సారాంశం

రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖకు కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ స్పందించింది. ఈ మేరకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు అపాలంటూ ఎపి ప్రభుత్వానికి లేఖ రాసింది. ఎన్జీటి గత ఫిబ్రవరిలో ఇచ్చిన ఆదేశాలలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు చేపట్టవద్దని స్పష్టంగా చెప్పారని ప్రస్తావిస్తూ లేఖలో కృష్ణ నది యాజమాన్య బోర్డ్ పేర్కొన్నది.

రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖకు కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ స్పందించింది. ఈ మేరకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు అపాలంటూ ఎపి ప్రభుత్వానికి లేఖ రాసింది. ఎన్జీటి గత ఫిబ్రవరిలో ఇచ్చిన ఆదేశాలలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు చేపట్టవద్దని స్పష్టంగా చెప్పారని ప్రస్తావిస్తూ లేఖలో కృష్ణ నది యాజమాన్య బోర్డ్ పేర్కొన్నది.

కేఆర్ఎంబి నిపుణుల కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించి పనులు జరుగుతున్నాయో, లేదో అనేది ట్రిబ్యునల్లో పేర్కొందని లేఖలో బోర్డ్ తెలిపింది. నిపుణుల కమిటీ పర్యటన కు ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించటం లేదని ఆరోపించింది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీనిపై పిర్యాదు చేసిందని.. అయితే, డిపిఆర్ లు సమర్పించి ఆమోదం పొందే వరకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులలో ముందుకు వెల్లద్దు అని ఏపీ ప్రభుత్వంకు కృష్ణ బోర్డ్ స్పష్టం చేసింది.

ఏపీ ప్రాజెక్టులపై క్రిష్ణ బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు.....

కాగా, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అనుమతుల్లేకుండా అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకంతో పాటు, పోతిరెడ్డిపాడు విస్తరణ పనులను తక్షణమే ఆపేలా తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డును కోరింది. 

ఈమేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ కృష్ణా బోర్డు ఛైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌కు లేఖ రాశారు. జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ)స్టే విధించినప్పటికీ ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయని లేఖలో పేర్కొన్నారు. ఎన్జీటీ ఆదేశాలను కృష్ణా బోర్డు అడ్డుకోలేకపోయిందన్నారు. 

డీపీఆర్‌ కోసం ప్రాథమిక పనులు అని చెప్పిన ఏపీ ప్రభుత్వం అక్కడ ప్రాజెక్టు పనులను కొనసాగిస్తోందని  ఆక్షేపించారు. ఎన్జీటీ ఆదేశాల మేరకు కృష్ణా బోర్డు కనీసం నిజనిర్ధారణ కమిటీని కూడా అక్కడకు పంపలేకపోయిందన్నారు. కృష్ణా బోర్డు అనుమతులు, ఆమోదం లేకుండా పనులు చేపట్టరాదని కేంద్ర ప్రభుత్వం కూడా ఆదేశించిన విషయాన్ని లేఖలో గుర్తు చేశారు. 

ఇటీవల జరిగిన తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో ఏపీ వైఖరిని తీవ్రంగా నిరసించారన్న రజత్‌కుమార్‌.. ఏపీ చర్యలతో తెలంగాణలోని కృష్ణాబేసిన్‌లో ఉన్న కరవు, ఫ్లోరైడ్‌ ప్రభావిత ప్రాంతాలు, హైదరాబాద్‌ తాగునీటి అవసరాలపై ప్రభావం పడుతుందని తెలిపారు. అనుమతుల్లేకుండా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు విస్తరణ పనులను తక్షణమే ఆపేలా తగు చర్యలు తీసుకోవాలని బోర్డుకు విజ్ఞప్తి చేశారు. 

కృష్ణా జలాల్లో తెలంగాణ న్యాయబద్ధమైన వాటాను పరిరక్షించాలని కోరారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులకు సంబంధించిన చిత్రాలను కూడా లేఖతో జతపరిచారు.

PREV
click me!

Recommended Stories

Sajjala Ramakrishna REddy Pressmeet: మీ ఆటలు సాగవు సజ్జల స్ట్రాంగ్ వార్నింగ్| Asianet News Telugu
Chief Justice of India Justice Surya Kant Visits Tirumala: తిరుమల శ్రీవారి సేవలో జస్టిస్ సూర్యకాంత్