మాతృదినోత్సవం రోజే దారుణం...డబ్బుల కోసం కన్నతల్లిని చంపిన కసాయి

Published : May 14, 2019, 08:12 PM ISTUpdated : May 14, 2019, 08:13 PM IST
మాతృదినోత్సవం రోజే దారుణం...డబ్బుల కోసం కన్నతల్లిని చంపిన కసాయి

సారాంశం

నవ మాసాలు మోసి కని పెంచిన మాతృమూర్తులను గుర్తుచేసుకుంటూ మాతృదినోత్సవాన్ని జరుపుకుంటాం.  ఈ రోజున మనకోసం నిరంతరం శ్రమించే తల్లుల త్యాగాలను, గొప్పతనాన్ని గుర్తుచేసుకుంటుంటారు. కనీసం ఈ ఒక్కరోజైనా కన్న తల్లులను బాధ పెట్టొద్దని భావిస్తుంటారు. అలాంటి రోజునే ఆంధ్ర ప్రదేశ్ విజయనగరం జిల్లాలో ఓ కిరాతక తనయుడు దారుణానికి పాల్పడ్డాడు. మద్యం మత్తులో డబ్బుల కోసం తల్లిని అతి దారుణంగా హతమమార్చాడు. 

ఈ దారుణ ఘటనపై పోలీసులు,  ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నెల్లిమర్ల మండల పరిషత్ కార్యాలయం వద్ద గౌరమ్మ అనే మహిళ చిన్న టీ కొట్టు నడుపుకుంటూ జీవనం సాగించేది. ఆమె చిన్న కొడుకు శ్రీను చెడు అలవాట్లకు బానిసై నిత్యం డబ్బులకోసం తల్లిని వేధించేవాడు. అంతేకాకుండా అప్పుడప్పుడు మద్యం మత్తులో తల్లిపై దాడికి పాల్పడేవాడు.

ఈ క్రమంలోనే ఆదివారం మాతృదినోత్సవం రోజుకూడా ఫుల్లుగా మద్యం తాగాడు. ఈ మత్తులోనే తల్లి నడిపై టీ కొట్టు వద్దకు వచ్చి డబ్బులు కావాలని అడిగాడు. అయితే పొద్దునే కొట్టు తెరవగానే అతడు రావడంతో ఆమె డబ్బులు లేవని చెప్పింది. దీంతో ఆగ్రహానికి గురైన అతడు విచక్షణను కోల్పోయి తల్లి  తలపై బండరాయితో మోదాడు. అంతే...ఆమె తల పగిలి రక్తపు మడుగులో పడి అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. 

ఈ హత్యపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు. కన్న తల్లిన ఈ కిరాతకున్ని కఠినంగా  శిక్షించాలని స్థానికులు పోలీసులను కోరుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

Vijaysai Reddy Sensational Comments On YS Jagan | Asianet News Telugu
Annadata Sukhibhava: రైతుల‌కు ద‌స‌రా కానుక‌.. ఖాతాల్లోకి రూ. 6000 జ‌మ‌, ఎప్పుడంటే.?