వైఎస్ నన్ను ఎంపీని చేశారు, ఆయన జీవితం ఓపెన్ బుక్ : ఉండవల్లి అరుణ్ కుమార్

By Nagaraju penumalaFirst Published May 14, 2019, 7:03 PM IST
Highlights

1983 నాటికే ఆయన పీసీసీ ప్రెసిడెంట్ గా పనిచేశారన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా వైఎస్ ఉన్నప్పుడు తాను రాజమండ్రిలో చిన్న కార్యకర్తనని స్పష్టం చేశారు. అలాంటి కార్యకర్తను వైఎస్ ఎంపీని చేశారని అప్పటి వరకు తనకు ఆయనతో ఉన్న అనుభవాలను రాశానని చెప్పుకొచ్చారు. 
 

హైదరాబాద్: దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గొప్ప వ్యక్తి అని కొనియాడారు రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. ఉండవల్లి అరుణ్ కుమార్ రచించిన వైయస్సార్ తో ఉండవల్లి అరుణ్ కుమార్ పుస్తక ఆవిష్కరణ హైదరాబాద్ లో జరిగింది. 

వైయస్సార్ తో ఉండవల్లి అరుణ్ కమార్ కొన్ని సంఘటనలు, అనుభవాలు, జ్ఞాపకాలు అనే పుస్తకాన్ని మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ తనను వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై పుస్తకం రాయాలంటూ కాంగ్రెస్ పార్టీ కీలక నేత కేవీపీ రామచంద్రరావు సతీమని సునీత కోరారని స్పష్టం చేశారు. 

వైఎస్ తో ఉన్న సంబంధాలపై పుస్తకం రాయాలంటూ ఆమె ఒత్తిడి తెచ్చారని చెప్పుకొచ్చారు. ఆమె నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశానని అయినా తప్పలేదని వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి రాయాలంటే ఎందరో గురించి రాయాలని అయితే వారిలో కొంతమంది వేర్వేరు పార్టీలలో చేరిపోయారని వారి గురించి ప్రస్తావిస్తే లేనిపోని సమస్యలు వస్తాయని అందువల్లే ఆలస్యం చేశానని చెప్పుకొచ్చారు. 

వైఎస్ రాజశేఖర్ రెడ్డి దైవ సమానుడని ఆవిష్కరణ చేసే  ప్రయత్నం చెయ్యలేదన్నారు ఉండవల్లి. తనలాంటి వాళ్లు రాజశేఖర్ రెడ్డి జీవితంలో వేలమంది ఉంటారని ఉండవల్లి వ్యాఖ్యానించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పార్టీ అధ్యక్షుడిగా తాను ఒక కార్యకర్తగా ఉన్నప్పుడు పరిచయం ఏర్పడిందన్నారు. 

1983 నాటికే ఆయన పీసీసీ ప్రెసిడెంట్ గా పనిచేశారన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా వైఎస్ ఉన్నప్పుడు తాను రాజమండ్రిలో చిన్న కార్యకర్తనని స్పష్టం చేశారు. అలాంటి కార్యకర్తను వైఎస్ ఎంపీని చేశారని అప్పటి వరకు తనకు ఆయనతో ఉన్న అనుభవాలను రాశానని చెప్పుకొచ్చారు. 

పుస్తకం రాయాలంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత ఆప్తులు రాయాలని తాను భావించేవాడినని చెప్పుకొచ్చారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పదేపదే చెప్పేవారని తన ఆత్మ కేవీ అని కేవీపీ పుస్తకం రాస్తే బాగుంటుందని తాను భావించినట్లు చెప్పుకొచ్చారు. అయితే ఎమ్మెస్కో, సునీల ప్రోత్సాహంతో తానే రాశానని చెప్పుకొచ్చారు. 

కేవీపీ రాస్తే ప్రజలకు తెలియని కొన్ని సంఘటనలు బయటకు వచ్చేవన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఓపెన్ బుక్ అన్నారు. ఆయన జీవితంలో సీక్రేట్ అంటూ ఏమీ ఉండదన్నారు. 

అసమ్మతి నుంచి నెగ్గుకు రాగలిగారని, అనంతరం పాదయాత్ర, ముఖ్యమంత్రిగా ఆయన చేసిన సేవలు అన్నింటిని తాను పొందుపరచినట్లు తెలిపారు. ఈ పుస్తకం చదివితే ఎన్నో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు. పుస్తకం చదివిన వారంతా ఎంతో సంతోషిస్తారని తాను భావిస్తున్నట్లు ఉండవల్లి తెలిపారు. 

click me!