తండ్రిని లారీతో గుద్ది.. హతమార్చిన కొడుకు.. కారణం ఏంటంటే..

By SumaBala BukkaFirst Published Feb 2, 2023, 9:52 AM IST
Highlights

కన్నతండ్రికి కర్కశంగా లారీతో గుద్ది హతమార్చాడో కొడుకు. కుటుంబకలహాల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్టుగా సమాచారం.

కడప : కుటుంబ కక్షల నేపథ్యంలో తండ్రులను దారుణంగా హింసిస్తున్న కొడుకుల ఉదంతాలు భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఉత్తరాఖండ్లో ఓ కొడుకు కుటుంబ కలహాల నేపథ్యంలో తండ్రి చేతివేళ్లను, పురుషాంగాన్ని కోసిన ఘటన బుధవారం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలో గురువారం మరొకటి వెలుగు చూసింది. కన్న తండ్రిని లారీతో తొక్కించి హతమార్చాలని చూసాడో కొడుకు. 

ఈ దారుణ ఘటన  బుధవారం నాడు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం రాజుపాలెం వద్ద జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. కడప జిల్లాకు ముద్దనూరు మండలం కొర్రపాడుకు చెందిన  షఫీ.. తండ్రి మహబూబ్బాషా (52). వీరిద్దరూ లారీ మీద పనిచేస్తున్నారు. . బుధవారం తాడిపత్రి నుంచి సిమెంటు లోడు లారీతో నెల్లూరుకు తండ్రి కొడుకులు బయలుదేరారు. వీరిద్దరితోపాటు ఓబయ్య అనే మరో డ్రైవర్ కూడా ఉన్నాడు.

లారీ స్టార్ట్ చేసినప్పటి నుంచి తండ్రీకొడుకులు ఇద్దరు గొడవ పడుతూనే ఉన్నారు. ఎంతసేపటికి వారిద్దరూ గొడవ ఆపకపోవడంతో ఓబయ్య లారీని రాజయ్యపాలెం వద్ద ఆపేసి, లారీ దిగి వెళ్లిపోయాడు. దీంతో తండ్రి కొడుకుల మధ్య వివాదం మరింత తీవ్ర స్థాయికి చేరింది. డ్రైవర్ కూడా ఆయన షఫీ లారీ ఎక్కి ముందుకు వెళ్లబోయాడు.. కాగా, తండ్రి లారీకి అడ్డుగా నిలబడ్డాడు. అయితే, అప్పటికే తండ్రి మీద కోపంగా ఉన్న షఫీ..లారీకి అడ్డుగా నిలబడడంతో కోపంతో లారీని తండ్రి మీదికి ఉరికించాడు.

గుంటూరులో కిడ్నాప్ కలకలం.. మిర్చి యార్డులో వ్యాపారిని ఎత్తుకెళ్లిన దుండగులు..!

దీంతో భాష అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అది చూసిన నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం పోలీసులకు చేరింది.  వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి, నిందితుడు కోసం గాలింపు మొదలుపెట్టారు.

ఇదిలా ఉండగా, ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉద్ధంసింగ్ నగర్ జిల్లా కాశీపూర్ పట్టణంలోని ఓ కొడుకు తండ్రి మీద పట్టరాని ఆవేశంతో దాడి చేశాడు. ఈ దాడిలో తండ్రి ఎడమ చేతి వేళ్లను, పురుషాంగాన్ని కోసేశాడు. ఈ ఘటనలో బాధితుడు సోదరుడు సహాయంతో ఆసుపత్రిలో చేరాడు.  అక్కడ చికిత్స పొంది.. కోలుకున్న తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ విషయం మీద పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు కోసం గాలిస్తున్నారు.

బాధితుడు ఫిర్యాదులో తన మీద జరిగిన దాడి గురించి పేర్కొంటూ.. తన కొడుకు అర్పిత్ ఆర్మీలో పనిచేస్తున్నాడని తెలిపాడు. డిసెంబర్ 26న అతనితోపాటు స్థానికంగా ఉండే  రాహుల్ సైని, రోహిత్ వర్మ, ఇంకొకరు కలిసి తనపై దాడి చేశారని తెలిపాడు. ఆ సమయంలో వారంతా తాగి ఉన్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. స్థానికంగా ఉన్న కచనాల్ గాజీ కుమావూన్ కాలనీలో  తనపై ఈ పాశవిక దాడి జరిగింది అని తెలిపాడు.

ఈ దాడి సమయంలో ముగ్గురు వ్యక్తులు తన కాళ్లు చేతులు, నోరు నొక్కి పట్టుకున్నారని.. కలపకోసే పరికరంతో నాలుగో వ్యక్తి తన మీద దాడికి దిగినట్లు వివరించాడు. దాడితో తీవ్ర రక్తస్రావంతో తాను స్పృహ తప్పి పడిపోయానని.., ఆ సమయంలో నిందితులు పారిపోయినట్లు  చెప్పారు.  దీని గురించి కాశీపూర్ ఎస్పీ అభయ్ సింగ్ మాట్లాడుతూ..ఈ దాడి కుటుంబ గొడవల కారణంగా జరిగినట్లుగా,  కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

click me!