టీడీపీ మండలాధ్యక్షుడిపై కాల్పులు.. పల్నాడులో దారుణం..

Published : Feb 02, 2023, 06:40 AM IST
టీడీపీ మండలాధ్యక్షుడిపై కాల్పులు.. పల్నాడులో దారుణం..

సారాంశం

ఆంధ్రప్రదేశ్ లోని పల్పాడు జిల్లాలో కాల్పుల కలకలం చెలరేగింది. టీడీపీ మండలాధ్యక్షుడి మీద గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. 

పల్నాడు జిల్లా : ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో కాల్పులు కలకలం సృష్టించాయి.  రొంపిచర్ల మండలం అలవాలలో కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి. మాజీ ఎంపీపీ,  టిడిపి మండలాధ్యక్షుడు  బాలకోటిరెడ్డి మీద  ఈ కాల్పులు జరిగాయి. ప్రత్యర్థులు ఆయన మీద రెండు రౌండ్ల కాల్పులు  చేశారు. బాల పోటిరెడ్డి ఇంట్లోకి ప్రవేశించిన  దుండగులు ఈ దురాగతానికి పాల్పడ్డారు.  ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయారు. 

ఈ కాల్పులతో తీవ్రంగా గాయాల పాలైన బాలకోటిరెడ్డిని కుటుంబ సభ్యులు నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం అందించారు. ఈ సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కాల్పులు జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. తెలుగుదేశం పార్టీ నేత చదలవాడ అరవిందబాబు బాధితుడిని ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. 
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్