దారుణం.. అమ్మ అన్నం అడిగిందని.. భార్యతో కలిసి దాడిచేసిన కొడుకు..

Published : Jan 21, 2023, 12:16 PM IST
దారుణం.. అమ్మ అన్నం అడిగిందని.. భార్యతో కలిసి దాడిచేసిన కొడుకు..

సారాంశం

అన్నం అడిగిందని తల్లిని భార్యతో కలిసి దారుణంగా కొట్టాడో కొడుకు. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆమె పోలీసులను ఆశ్రయించింది. 

కర్నూలు : కర్నూలులో దారుణమైన ఘటన చోటుచేసుకుంది.  శుక్రవారం ఓ వృద్ధురాలు తన కోడలు, కొడుకుపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆకలిగా ఉంది అన్నం పెట్టమని అడిగినందుకు తనను తీవ్రంగా కొట్టారని ఆరోపించింది. ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలో హనుమంత రెడ్డి దంపతులు  నివసిస్తున్నారు.  కొద్ది రోజుల క్రితం వీరి కొడుకు పెళ్లి జరిగింది. ఈ పెళ్లికి వచ్చిన హనుమంత రెడ్డి తల్లి శివమ్మ వారింట్లోనే ఉంటుంది. 

శుక్రవారం ఉదయం తనకు ఆకలిగా ఉందని అన్నం పెట్టాలని అడిగింది. లేకపోతే ఏదైనా టిఫిన్ బయట నుంచి తెచ్చి పెట్టమని కోరింది. దీంతో కొడుకు కోడలు ఆమె మీద కోపానికి వచ్చారు. దాడి చేశారు. తాను సంపాదించిన ఆస్తిని కొడుకుకి ఇచ్చానని.. దానిని  వారు అనుభవిస్తూ ముసలితనంలో తనపై ఇలా దాడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇది ఎంతవరకు సమంజసమో చెప్పాలని కన్నీటి పర్యంతమయింది.

దేవుని సేవ ముసుగులో అక్రమ సంపాదన.. శ్రీశైలం ఆలయ ధర్మకర్తల మండలి సభ్యురాలి ఆడియో వైరల్..!

కొడుకు కోడలు దాడిలో గాయపడి లేవలేని స్థితిలో ఉన్న వృద్ధురాలిని స్థానికుల సమాచారం మేరకు బంధువులు రక్షించి ఆసుపత్రికి తరలించారు. ఆమె ఫిర్యాదు విషయమై సిఐ మురళీమోహన్ తో మీడియా ప్రస్తావించగా.. కొడుకు, కోడలిని పిలిచి తల్లిని బాగా చూసుకునేలా కౌన్సిలింగ్ ఇస్తామని ఆ పనిలోనే ఉన్నామని తెలిపారు. ఇక గాయపడిన వృద్ధురాలిని ఆమె బంధువులు వారి ఇంటికి తీసుకువెళ్లారని తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : శ్రీలంక సమీపంలో ఆవర్తనం... ఈ ప్రాంతాల్లో కుండపోత వర్షాలు
Minister Narayana: అమరావతికి కొత్త దారి.. పరిశీలించిన మంత్రి నారాయణ | Asianet News Telugu