పోలవరానికి బాబుకు సంబంధం లేదు.. జయదేవ్‌కి పాలిటిక్స్ కొత్త.. బాబాయ్, అబ్బాయ్ దొచుకుంటున్నారు

Published : Jul 21, 2018, 05:56 PM ISTUpdated : Jul 21, 2018, 06:04 PM IST
పోలవరానికి బాబుకు సంబంధం లేదు.. జయదేవ్‌కి పాలిటిక్స్ కొత్త.. బాబాయ్, అబ్బాయ్ దొచుకుంటున్నారు

సారాంశం

తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు.. టీడీపీ మేనిఫెస్టోలో అసలు పోలవరం అన్న అంశమే లేదని.. ఆ ప్రాజెక్టుకు, చంద్రబాబుకు అవగింజంత సంబంధం కూడా లేదని సోము అన్నారు

తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు.. టీడీపీ మేనిఫెస్టోలో అసలు పోలవరం అన్న అంశమే లేదని.. ఆ ప్రాజెక్టుకు, చంద్రబాబుకు అవగింజంత సంబంధం కూడా లేదని సోము అన్నారు.. పోలవరానికి 2005లో వైఎస్సార్ శంకుస్థాపన చేశారని.. దాని గురించచి ఏనాడు ముఖ్యమంత్రి మాట్లాడలేదని గుర్తు చేశారు.. ముందు పోలవరం మీద చర్చ జరగాలని సోము డిమాండ్ చేశారు.

విభజన సమయంలో పోలవరం గురించి నోరెత్తలేకపోయిన అసమర్థులు టీడీపీ ఎంపీలని ఆయన ఆరోపించారు.. పార్లమెంటును స్తంభింపజేసి ప్రజాధనాన్ని కాంగ్రెస్, టీడీపీలు దుర్వినియోగం చేస్తున్నాయి.. అవిశ్వాసం సమయంలో హోదా గురించి, రెవెన్యూ లోటు గురించి కాంగ్రెస్, టీడీపీలు ఒక మాట కూడా మాట్లాడలేకపోయాయని ఎద్దేవా చేశారు..

 ఏపీకి వచ్చిన ఉపాధి హామీ నిధులతో రెండు పోలవరం ప్రాజెక్టులు నిర్మించవచ్చని.. ఏపీ ప్రజలను ఆదుకున్న ఏకైక పార్టీ బీజేపీయేనని, రాష్ట్రంలో అభివృద్థి కూడా ప్రధాని వల్లనే అని సోము వీర్రాజు అన్నారు.. రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్.. అసెంబ్లీలో జగన్ మాట్లాడిన మాటలే మాట్లాడారని చెప్పారు..

శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు మట్టి తవ్వకాల్లో రాజధాని కట్టేంత వరకు అవినీతికి పాల్పడ్డారని వీర్రాజు ఆరోపించారు. చంద్రబాబు కాంగ్రెస్ పార్టీని పొగుడుతారని..వైసీపి నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇస్తారని విమర్శించారు.. రాష్ట్రానికి అన్యాయం చేసింది టీడీపీ, కాంగ్రెస్‌లేనని.. తామే అసలైన దేశభక్తులం, జాతీయవాదులమని సోము స్పష్టం చేశారు. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ కుండపోత వర్షాలు, వరదలు... ఇక్కడ కూడా వానలు షురూ..!
Hello Lokesh Interaction: హలో లోకేష్ కార్యక్రమంలోవిద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Asianet News Telugu