బీజేపీ, జనసేనలు కలిసే ఉన్నాయి.. అప్పుడు నేను కూడా చంద్రబాబును కలిశాను: సోము వీర్రాజు

Published : Apr 05, 2023, 01:09 PM ISTUpdated : Apr 05, 2023, 01:19 PM IST
బీజేపీ, జనసేనలు కలిసే ఉన్నాయి.. అప్పుడు నేను కూడా చంద్రబాబును కలిశాను: సోము వీర్రాజు

సారాంశం

తెలంగాణలో పేపర్ లీకేజ్ బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యమేనని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు విమర్శించారు. అందులో తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్‌ ప్రమేయం ఏముటుందని ప్రశ్నించారు. 

తెలంగాణలో పేపర్ లీకేజ్ బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యమేనని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు విమర్శించారు. అందులో తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్‌ ప్రమేయం ఏముటుందని ప్రశ్నించారు. గతంలో ఎమ్మెల్యేలకు ప్రలోభాలు అంటూ డ్రామాలు ఆడారని విమర్శించారు. కేసీఆర్ తెలంగాణలో దోచుకున్న డబ్బుతో దేశంలో రాజకీయాలు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి చర్యలకు బీజేపీ భయపడదని అన్నారు. అలాగే బీజేపీ, జనసేల పొత్తుపై కూడా సోము వీర్రాజు మట్లాడారు. 

బీజేపీ, జనసేల పార్టీలు కలిసే ఉన్నాయని సోమువీర్రాజు అన్నారు. బీజేపీ, జనసేనలు పొత్తులో ఉన్నాయని.. అందుకే పవన్ కల్యాణ్ బీజేపీ అగ్రనేతలను కలిశారని చెప్పారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాము పోరాడుతామని చెప్పారు. జనసేన, బీజేపీ కలిసి వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపుతాయని అన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలవడంలో తప్పేముందని అన్నారు. గతంలో రాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థికి మద్దతిచ్చిన సమయంలో తాను కూడా చంద్రబాబును కలిశానని చెప్పారు. అలాగే చంద్రబాబు నాయుడు కూడా జనసేన నాయకులను కలిశారని అన్నారు. అంతా మాత్రానికే కలిసిపోయారంటే ఎలా అని ప్రశ్నించారు. రాజకీయాల్లో ఎవరిని ఎవరైనా కలుస్తారని చెప్పారు. తాము జనసేనతో కలిసి ముందుకు సాగుతామని తెలిపారు.

ఇదిలా ఉంటే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోమ, మంగళ వారాల్లో రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా పవన్ కల్యాణ్ సోమవారం మురళీధరన్‌తో సమావేశం అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో తాజా రాజకీయ పరిస్థితులు, పొత్తులు, భవిష్యత్ కార్యచరణపై ఆయనతో పవన్ చర్చించినట్టుగా తెలుస్తోంది. అదే రోజు రాత్రి కేంద్ర మంత్రి గజేంద్ర షేకావత్‌తో పవన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అంశాలపై చర్చించారు. మంగళవారం రోజు ఉదయం మురళీధరన్‌‌తో పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ శివప్రకాష్ కూడా పాల్గొన్నారు. 

మంగళవారం రాత్రి జేపీ నడ్డాను ఆయన నివాసంలో పవన్ కల్యాణ్ కలిశారు. దాదాపు 45 నిమిషాల ఈ సమావేశం సాగింది. ఈ సమావేశంలో నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు. ఏపీలో నెలకొన్న రాజకీయ పరిణామాలపై, వైసీపీ పాలన, ప్రతిపక్షాలపై దాడులతో పాటు ఇతర అంశాలు ప్రస్తావనకు వచ్చినట్టుగా తెలస్తోంది. జేపీ నడ్డాతో భేటీ అనంతరం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ తమ అజెండా అని వివరించారు. ఆ దిశగానే తాము చర్చలు చేశామని చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా వ్యవహరించడంపైనే ఫోకస్ పెట్టామని వివరించారు.

ఆంధ్రప్రదేశ్‌ సుస్థిరత్వం సాధించాలనే తాము సంకల్పించినట్టు పవన్ కళ్యాణ్ వివరించారు. అందుకోసం వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎట్టిపరిస్థితుల్లో చీలనివ్వబోమని తెలిపారు. అటువైపు చర్చలు చేశామని అన్నారు. తమ చర్చలు ఇప్పటి వరకు పొత్తులపై మాట్లాడేంతగా వెళ్లలేవని అన్నారు. అయితే, బీజేపీ, జనసేన పార్టీలు రెండూ కూడా స్థానికంగా బలోపేతం కావడంపై శ్రద్ధ పెట్టినట్టు వివరించారు. ఈ చర్చల సత్ఫలితాలు త్వరలోనే కనిపిస్తాయని వివరించారు. రాబోయే రోజుల్లో అన్ని విషయాలు వివరంగా వివరిస్తానని అన్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?