
కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్ర నేత అమిత్ షా(Amit shah)తో భేటీ తర్వాత ఏపీ బీజేపీ (AP BJP) వైఖరిలో మార్పు వచ్చినట్టుగా కనిపిస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజు (somu veerraju) రాష్ట్రంలోని పలు అంశాలపై బీజేపీ వైఖరిని స్పష్టం చేశారు. రాజధాని అంశంతో (capital Issue) పాటుగా, అమరావతి రైతుల పాదయత్ర, ఎయిడెడ్ విధానంపై బీజేపీ వైఖరిని వెల్లడించారు. అమరాతి రైతులు చేపట్టిన పాదయాత్రకు (amaravati farmers padayatra) తమ పార్టీ మద్దతు తెలుపుతుందని బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. అంతేకాకుండా ఏపీ రాజధాని అంశంపై కూడా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతే అనే విషయానికి బీజేపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాష్ట్ర బీజేపీ నేతలకు అమిత్ షా దిశా నిర్దేశం చేశారని వెల్లడించారు.
అధికారంలోకి రావడానికి పార్టీని ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. రాష్ట్ర అభివృద్దికి సంబంధించిన వినతులను నేరుగా అమిత్ షాకు ఇచ్చామని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కంటే నిధులిద్దామని అమిత్ షా అన్నట్టుగా చెప్పారు. ఎయిడెడ్ విద్యా విధానంపై ప్రభుత్వ వైఖరి సరైంది కాదని సోము వీర్రాజు అన్నారు. ఈ నెల 26న విజయవాడ సమావేశంలో భవిష్యత్ కార్యచరణను ప్రకటిస్తామని చెప్పారు.
Also read: వైసీపీనే ప్రధాన ప్రత్యర్ధి, రాష్ట్ర నేతలకు క్లాస్: అమిత్ షాతో ఏపీ బీజేపీ నేతల భేటీ
ఇక, కేంద్ర హోంశాఖ మంత్ర అమిత్ షా పార్టీ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనేందుకు తిరుపతి వచ్చినఅమిత్ షాతో బీజేపీకి చెందిన ఏపీ రాష్ట్ర ముఖ్య నాయకులు సోమవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా 2024లో ఏపీలో అధికారాన్ని కైవసం చేసుకొనేందుకు కార్యాచరణ రూపొందించుకోవాలని అమిత్ పార్టీ నాయకులు దిశా నిర్దేశం చేశారు. అంతేకాకుండా కొందరు పార్టీ నేతలకు అమిత్ షా క్లాస్ తీసుకొన్నారని సమాచారం.
రాష్ట్రంలో తమ ప్రధాన ప్రత్యర్ధి వైసీపీ అని బీజేపీ నేతలకు Amit shah షా తేల్చి చెప్పారు. మరో వైపు Amaravatiని ఏపీ రాజధాని అనే స్టాండ్ కు బీజేపీ కట్టుబడి ఉన్నందున నేతల మధ్య బేదాభిప్రాయాలు ఉన్న విషయమై అమిత్ షా ఆరా తీశారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని అమిత్ షా పార్టీ నేతలకు తేల్చి చెప్పారు.జనసేన పార్టీతో కలిసి 2024లో ఏపీ రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకోవాలని అమిత్ షా పార్టీ నేతలకు సూచించారు.ఈ దిశగా కార్యాచరణ సిద్దం చేసుకోవాలని ఆయన పార్టీ నేతలను కోరారు.జనసేనతో కలిసి ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని ఆయన పార్టీ నేతలకు సూచించారు.