Kuppam Municipal election: కుప్పం ఓట్ల లెక్కింపుపై టీడీపీ లంచ్ మోషన్ పిటిషన్.. హైకోర్టు కీలక ఆదేశాలు..

By team teluguFirst Published Nov 16, 2021, 1:15 PM IST
Highlights

కుప్పం మున్సిపల్ ఎన్నికల (Kuppam Municipal election) ఓట్ల లెక్కింపుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో (AP High Court) టీడీపీ (Tdp) లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. . ఓట్ల లెక్కింపు సందర్బంగా ప్రత్యేక పరిశీలకుడిని నియామించాలని ఈ  పిటిషన్‌లో కోరింది. 

కుప్పం మున్సిపల్ ఎన్నికల (Kuppam Municipal election) ఓట్ల లెక్కింపుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో (AP High Court) టీడీపీ (Tdp) లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. . ఓట్ల లెక్కింపు సందర్బంగా ప్రత్యేక పరిశీలకుడిని నియామించాలని ఈ  పిటిషన్‌లో కోరింది. ఓట్ల లెక్కింపును వీడియో రికార్డు చేయాలని పిటిషన్‌లో పేర్కొంది. టీడీపీ దాఖలు చేసిన లంచ్ ‌మోషన్ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరపున లాయర్లు వెంకటేశ్వర్లు, గింజుపల్లి సుబ్బారావు వాదనలు వినిపించారు. అనంతరం హైకోర్టు కీలక ఆదేశాలు జరీ చేసింది. కుప్పం మున్సిపల్ ఎన్నిక ఓట్ల లెక్కింపు కోసం ప్రత్యేక అధికారిని నిమయించాలని హైకోర్టు ఆదేశించింది. ప్రత్యేక పరిశీలకుడిగా ఐఏఎస్‌ ప్రభాకర్‌‌రెడ్డిని నియమించాలని ఆదేశాలు జారీ చేసింది. ఓట్ల లెక్కింపును వీడియో రికార్డు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. 

కుప్పం మున్సిపాలిటీలో మొత్తం 25 వార్డులు ఉండగా.. 14 వార్డు ఏకగ్రీవం కావడంతో మిగిలిన 24 వార్డులకు సోమవారం పోలింగ్ జరిగింది.  కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో 76.49 శాతం ఓటింగ్ నమోదైంది.కుప్పం మున్సిపల్ ఎన్నిక పోలింగ్ సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికకు సంబంధించి టీడీపీ తీవ్ర ఆరోపణలు చేసింది. కుప్పంలో వైసీపీ నేతలు దొంగ ఓట్లు వేయించిందని టీడీపీ ఆరోపించగా.. వైసీపీ ఆ ఆరోపణలను ఖండించింది. కుప్పంలో టిడిపీ అక్రమాలకు పాల్పడుతోందంటూ ఈసీకి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, నారాయణమూర్తి ఫిర్యాదు చేసారు.

Also read: Chandrababu Naidu: పోలీసుల పని ప్రజలు చేయాలా?.. చరిత్రలో ఎన్నడూ ఇలా జరగలేదు.. చంద్రబాబు నాయుడు ఫైర్

మొత్తం 39,259 మంది ఓటర్లలో 28,808 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా.. 76.49 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం తెలిపింది. ఎన్నికలు జరిగిన 24 వార్డుల్లో 4 వ వార్డులో 93.41, 8 వ వార్డులో 91.51 అత్యధిక పోలింగ్ శాతం నమోదైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థి డాక్టర్ సుధీర్ పోటీ చేస్తున్న 16వ వార్డులో 57.68 శాతం పోలింగ్ నమోదైంది. టీడీపీ చైర్మన్‌ అభ్యర్థి త్రిలోక్‌నాయుడు పోటీ చేసిన 24వ వార్డులో 72.43 శాతం పోలింగ్‌ నమోదైంది.

Also Read: దొంగ ఓట్ల కల్చర్‌ టీడీపీదే... ఆధారాలివే..: ఎస్ఈసికి వైసిపి ఎమ్మెల్సీ అప్పిరెడ్డి ఫిర్యాదు

పోలింగ్ ముగిసిన అనంతరం.. బ్యాలెట్ బాక్సులన్నింటినీ ఎంసీజే డిగ్రీ కళాశాలకు తరలించినట్లు కుప్పం మున్సిపల్ కమిషనర్, ఎన్నికల అధికారి వీఎస్ చిట్టిబాబు తెలిపారు. పోలింగ్ అధికారుల సమక్షంలో స్ట్రాంగ్ రూంను సీల్ చేశారు. నవంబర్ 17వ తేదీ ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది

click me!