నువ్వు అడిగితే మేం ఏం ఇవ్వం : సోము వీర్రాజు

First Published Jun 19, 2018, 5:40 PM IST
Highlights

నువ్వు అడిగితే మేం ఏం ఇవ్వం : సోము వీర్రాజు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఏపీ బీజేపీ నేత సోము వీర్రాజు మండిపడ్డారు.. హంద్రీనీవా, తెలుగుగంగ వంటి ప్రాజెక్టులు రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయని కానీ ముఖ్యమంత్రి మాత్రం పోలవరం కట్టేస్తానంటున్నారని అన్నారు. 2014లో అధికారంలోకి వచ్చి.. 2016లో పోలవరం ప్రాజెక్టు‌ను ప్రారంభించారని.. అప్పటి వరకు అది గుర్తురాకపోవడానికి కారణం బేరం కుదరకపోవడమేనని ఆరోపించారు.

కడప ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇవ్వలేదన్నారు.. అభివృద్ధి విషయంలో ఆయనకు రాయలసీమ కానీ.. ఉత్తరాంధ్ర కానీ కనిపించడం లేదని కేవలం అమరావతి మాత్రమే చంద్రబాబు కళ్లముందు కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. 600 కులాలకు హామీలు ఇచ్చుకుంటూ వెళ్లారని.. వీటిలో ఎంతమందికి హామీలు నెరవేర్చారని వీర్రాజు ప్రశ్నించారు. నాయి బ్రాహ్మాణులను ముఖ్యమంత్రి అవమానించారని.. అందుకు వారికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి మేం ఇవ్వవలసినవి తప్పకుండా ఇస్తామని.. నువ్వు అడిగితే ఇవ్వమని చంద్రబాబును ఉద్దేశించి అన్నారు.
 

click me!