నేను నటి వాణిశ్రీని ప్రేమించా: మంత్రి సోమిరెడ్డి వ్యాఖ్య

Published : Aug 25, 2018, 08:17 PM ISTUpdated : Sep 09, 2018, 11:03 AM IST
నేను నటి వాణిశ్రీని ప్రేమించా: మంత్రి సోమిరెడ్డి వ్యాఖ్య

సారాంశం

సినీ నటి వాణిశ్రీని తాను అప్పట్లో ప్రేమించినట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. సౌత్ ఇండియన్ సినీ కల్చరర్ అసోసియేషన్‌ని మరో మంత్రి నారాయణతో కలిసి ఆయన శనివారంనాడు ప్రారంభించారు.

నెల్లూరు: సినీ నటి వాణిశ్రీని తాను అప్పట్లో ప్రేమించినట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. సౌత్ ఇండియన్ సినీ కల్చరర్ అసోసియేషన్‌ని మరో మంత్రి నారాయణతో కలిసి ఆయన శనివారంనాడు ప్రారంభించారు. 
కస్తూర్భా కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఫిల్మ్, టెలివిజన్, థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌ అంబికా కృష్ణతో పాటు సీనియర్ నటి వాణిశ్రీ, భాగ్యరాజ్, సి. కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.
 
వాణిశ్రీకి తాను వీరాభిమానిని అని, ఆమె నటించిన సినిమాలు చాలా చూశనని, అప్పటి సినిమాలు తీపి జ్ఞాపకాలుగా మిగిలే ఉన్నాయని సోమిరెడ్డి అన్నారు. రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చారు.
 
రూ.4 కోట్ల లోపు బడ్జెట్ సినిమాలకు పన్ను మినహాయింపు ఇస్తామని ఫిల్మ్, టెలివిజన్, థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌ అంబికా కృష్ణ చెప్పారు. లోకేషన్లకు ఇబ్బంది లేకుండా చూస్తామని, ఉత్తమ సినిమాలకు రూ.10 లక్షలు అందిస్తామని హామీ ఇచ్చారు. డిసెంబర్ 26 నుంచి మూడు రోజులు షార్ట్ ఫిలిం పెస్టివల్ నిర్వహిస్తామని అని చెప్పారు.

PREV
click me!

Recommended Stories

Chandrababu Naidu With Bhuvaneshwari at Raj Bhavan ‘At Home’ Event | Asianet News Telugu
‘స్త్రీ శక్తి' లబ్ధిదారులతో సామాన్యుడిలా టికెట్ తీసుకుని ప్రయాణించిన సీఎం | Stree Shakti Scheme