ధర్మపోరాట సభలో జేసీ దివాకర్ రెడ్డి కలకలం

By sivanagaprasad KodatiFirst Published Aug 25, 2018, 6:28 PM IST
Highlights

కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్మపోరాట సభ నవ్వుల్లో మునిగి తేలింది. అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తన వ్యాఖ్యలతో అందర్నీకడుపుబ్బా నవ్వించారు. సంక్షేమ పథకాలు వద్దంటూ....ధర్మపోరాట దీక్షను ఆపెయ్యాలంటూ సూచించారు. అంతేకాదు ఈరోజో రేపు నువ్వు చచ్చిపోతావు..నేను చచ్చిపోతానంటూ చేసిన వ్యాఖ్యలు సరదాగా ఉండటంతో అంతా నవ్వేశారు. స్టేజ్ పై ఉన్నవాళ్లు కొంతమంది మిస్ లీడ్ చేసినా తాను చేయనని జేసీ అనడంతో చంద్రబాబు నాయుడు ఓనవ్వి నవ్వి ఊరుకున్నారు. 

కర్నూలు:  కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్మపోరాట సభ నవ్వుల్లో మునిగి తేలింది. అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తన వ్యాఖ్యలతో అందర్నీకడుపుబ్బా నవ్వించారు. సంక్షేమ పథకాలు వద్దంటూ....ధర్మపోరాట దీక్షను ఆపెయ్యాలంటూ సూచించారు. అంతేకాదు ఈరోజో రేపు నువ్వు చచ్చిపోతావు..నేను చచ్చిపోతానంటూ చేసిన వ్యాఖ్యలు సరదాగా ఉండటంతో అంతా నవ్వేశారు. స్టేజ్ పై ఉన్నవాళ్లు కొంతమంది మిస్ లీడ్ చేసినా తాను చేయనని జేసీ అనడంతో చంద్రబాబు నాయుడు ఓనవ్వి నవ్వి ఊరుకున్నారు. 

భారతదేశం ఉన్నంత వరకు మహాత్మగాంధీని ఎవరు మరచిపోలేరు...ఆంధ్రప్రదేశ్ ఉన్నంత వరకు సర్ అర్ధర్ కాటన్ ను మరచిపోలేవు....అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రజలు చంద్రబాబు నాయుడును మరచిపోలేరు...ఇది నిజం..మంత్రి పదవుల కోసమో లేక ఎంపీ ఎమ్మెల్యే టిక్కెట్ల కోసమో కాదు....కానీ వాస్తవం చెప్పాలి.  ఎంపీగా పోటీ చెయ్యాలని కానీ ఎమ్మెల్యేగా పోటీ చెయ్యాలని కానీ లేదు....రాజకీయాల నుంచి వైదొలగాలి అనుకుంటున్నాకానీ ప్రజల మనస్సులో ఏముందో చెప్పాలి కాబట్టి చెప్తున్నా అన్నారు....

ధర్మపోరాట దీక్షలను ఇక వదలిపెట్టాలని ప్రతీ జిల్లాకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదన్నారు...పండుగ పండుగకు బ్యాగులు ఇచ్చేస్తున్నారన్నారు. చంద్రబాబు నాయుడు చేతికి ఎముక లేదని దివాకర్ రెడ్డి ప్రశంసించారు. రాష్ట్రంలో తాగు నీటి సమస్యలను గమనించి నదులు అనుసంధానం చేసినందుకు ధన్యవాదాలు అన్నారు. సంక్షేమ పథకాలను ప్రజలు నాలుగు రోజులు మాత్రమే గుర్తు పెట్టుకుంటారని ఆ తర్వాత మరచిపోతారన్నారు...అదే ఎకరాలకు నీరందిస్తే...తరతరాలుగా గుర్తుంచుకుంటారన్నారు. 

పోలవరం ప్రాజెక్టు నా చిన్నతనం నుంచి వింటున్నానని ఆ పనులు చూస్తే అద్భుతంగా ఉందన్నారు. తుఫాన్ వస్తే తప్ప అది ఏం కాదన్నారు. 50, 60 ఏళ్లు వచ్చేసరికి అందరూ పోవాల్సిందే.. నేను పోవాల్సిందే మీరు పోవాల్సిందే అంటూ చమత్కరించారు. సంక్షేమ పథకాలు తమకు ఎక్కువ అయిపోయాయని...పథకాల వల్ల కడుపు నిండిపోయిందని జేబు నిండిపోయిందన్నారు. కాబట్టి సంక్షేమ పథకాలను వదిలేసి సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.   

మరోవైపు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై సెటైర్ వేశారు...కర్నూలు జిల్లాలో ఏముంది...కర్నూలు జిల్లా గురించి జేసీ దివాక్ రెడ్డి మాట్లాడతారంటూ ఛలోక్తులు విసిరారు.. అనంతపురం  నుంచి వచ్చి ఇక్కడ మా టైమ్ తినేస్తున్నారంటూ జోకులు వేశారు

click me!