లక్ష్మీ పార్వతినే హీరోయిన్ గా పెట్టుకోవాలట

Published : Oct 11, 2017, 10:10 PM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
లక్ష్మీ పార్వతినే హీరోయిన్ గా పెట్టుకోవాలట

సారాంశం

మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సెటైర్లకు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతుంటారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై తాజాగా మంత్రి చేసిన వ్యాఖ్యలు అలానే ఉన్నాయి. రామ్ గోపాల్ వర్మ తీయబోతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో హీరోయిన్ గా ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతినే తీసుకుంటే సరిపోతుందని ఎద్దేవా చేసారు.

మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సెటైర్లకు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతుంటారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై తాజాగా మంత్రి చేసిన వ్యాఖ్యలు అలానే ఉన్నాయి. రామ్ గోపాల్ వర్మ తీయబోతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో హీరోయిన్ గా ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతినే తీసుకుంటే సరిపోతుందని ఎద్దేవా చేసారు. వర్మ తీయబోయే సినిమా వెనుక వైసీపీ నేతలున్నారు కాబట్టి హీరోయిన్ కోసం వర్మ వెతుక్కోవాల్సిన అవసరం ఉండదన్నారు. రామ్ గోపాల్‌వర్మ వివాదాలతో సంచలనం కావాలనుకుంటారని మంత్రి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు.

ఎన్టీఆర్‌ జీవిత చరిత్రకు భంగం కలిగేలా సినిమా ఉంటే ఎన్టీఆర్‌ అభిమానులే వర్మకు తగిన బుద్ధిచెబుతారని కూడా సోమిరెడ్డి హెచ్చరించారు. సరే, ఒక్క వర్మ గురించి మాత్రమే మాట్లాడి ఊరుకుంటే ఆయన సోమిరెడ్డి ఎందుకవుతారు? జగన్ గురించి మాట్లాడుతూ, వర్షాలు పడకూడదని జగన్‌ పూజలు చేశారని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. వర్షాలు బాగా పడి శ్రీశైలం నిండితే వైసీపీకి మండుతోందని ఎద్దేవా చేశారు. హోదా పేరుతో విద్యార్థులను జగన్‌ మోసం చేస్తున్నారన్నారు. జగన్‌కు ప్రత్యేక హోదాపై మాట్లాడే అర్హత లేదని ఆయన అన్నారు.

PREV
click me!

Recommended Stories

Weather Update: ఉపరితల ఆవర్తనంతో ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్
ప్రెస్ మీట్ పెట్టి మరీ జగన్ పరువుతీసిన హోమ్ మంత్రి అనిత | Anitha Vangalapudi Strong Counter to Jagan