పాపం సోమిరెడ్డి : పార్టీ అండ కరువయింది

Published : Dec 31, 2016, 11:50 AM ISTUpdated : Mar 25, 2018, 11:55 PM IST
పాపం సోమిరెడ్డి :  పార్టీ అండ కరువయింది

సారాంశం

పార్టీలో సీనియర్ అయిన సోమిరెడ్డి మీద ప్రతిపక్ష పార్టీ నేత దాడిచేస్తుంటే, టిడిపి అధికార ప్రతినిధులుగాని, మంత్రులుగాని ఇంతవరకు పెద్దగా ఖండించ లేదు

పార్టీ మద్దతు లోపించిన టిడిపి సీనియర్ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి  విదేశీ లావాదేవీలపై విచారణ జరిపించాలని  వైసిసి నెల్లూరు జిల్లా ఎమ్మెల్యే కాకాని గోవర్దన్ రెడ్డి  శనివారం నాడు సీబీఐ, ఎన్‌ఫోర్స్‌‑మెంట్‌ డైరెక్టరేట్‌ లేఖలు రాశారు.

 

సోమిరెడ్డి మీద ఇంత అక్రమాలకు సంబంధించి దాడి జరుగుతున్నా, ఎవరో జిల్లానాయకులు తప్ప పార్టీ నుంచి పెద్దగా ఆయన మద్దతు దొరకకపోవడం ఆశ్చర్యం.

 

  పార్టీలో చాలాసీనియర్ నాయకుడయిన సోమిరెడ్డి మీద ప్రతిపక్ష పార్టీ దాడిచేస్తుంటే,పార్టీ అధికార ప్రతినిధులుగాని, మంత్రులుగాని ఇంతవరకు పెద్దగా ఖండించ లేదు.

 

ఎమ్మెల్సీ అయిన తర్వాత సీనియర్ నాయకుడి క్వాలిఫికేషన్ తో సోమిరెడ్డి మంత్రి పదవికోసం వత్తిడి తీసుకువస్తున్నట్లు చెబుతున్నారు.  ఇది అధిష్టానానికి ఇష్టం లేదు. ఇపుడు  ఈ అక్రమార్జన అరోపణలు రావడంతో , అపేరు చెప్పి సోమిరెడ్డి నూరు మూయించ వచ్చని పార్టీ భావిస్తూ ఉండటమో ఈ మౌనానికి కారణమని చెబుతున్నారు. సోమిరెడ్డి ఈ కేసుల్లో లేదా విచారణల్లో వివాదాస్పదమయితే మంత్రి పదవి కోసం వత్తిడి తీసుకురాడుకదా?

 

గత కొద్ది రోజులుగా ఆయన టిడిపి నేత సోమిరెడ్డి సంపాదనల వెల్లడిస్తూన్న సంగతెలిసిందే. సోమిరెడ్డితో పాటు, ఆయన కుటుంబసభ్యులు విదేశాలకు డబ్బు బదిలీచేయడం, మలేషియాలో అస్తులు కొనుగోలు చేయడం,  సింగపూర్ తోలావాదేవీలు జరపడం గురించి కొన్ని డాక్యమెంట్లతో సహా వెల్లడించిన సంగతి తెలిసిందే.

 

దీనితో అగ్రహించిన సోమిరెడ్డి ఇదంతా బోగస్ అని, డాక్యుమెంట్లు ఫోర్జరీ చేసినవి అని అంటూ కాకాని మీద కేసు పెట్టారు. తను పార్టీలో ఉంటూ సంపాదించిలేదని, నిజానికి ఉన్నదంత తగలబెట్టుకున్నానని మొత్తుకున్నారు, దీనికి బదులుగా మరొక సవాల్ విసురుతూ అసలు తండ్రి నుంచి సోమిరెడ్డికి సంక్రమించిన ఆస్తి ఎంతో వెల్లడించాలని  చెప్పారు.

 

ఈ రోజు ఆయన నేరుగా సిబిఐ, ఎన్ ఫోర్స్ మెంటు డైరెక్టొరేట్ కు ఉత్తరాలు రాసి,సోమిరెడ్డి లావాదేవీల మీద విచారణ జరిపించాలని కోరారు.

 

‘ నా  దగ్గరున్న అన్ని ఆధారాలు సిబి ఐ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టేట్ పంపాను. సోమిరెడ్డి జైలుకు వెళ్లక తప్పదు,’అన్నారు. సోమిరెడ్డికి ధైర్యం ఉంటే విచారణకు ఎందుకు సిద్ధపడటం లేదని కాకాని ప్రశ్నించారు.



కేసులకు తాను భయపడే బాపతు కాదని, దేనికైన సిద్ధంగా ఉన్నానని చెబుతూ క్రిమినల్‌ కేసులు పెట్టాల్సి వస్తే సోమిరెడ్డిపై రెండు,మూడొందల కేసులు పెట్టాల్సి వస్తుందని అన్నారు.

 

‘మంత్రిగా ఉన్నపుడు క్రికెట్‌ కిట్‌లు అమ్ముకున్నడు.  చెట్టు-నీరు కార్యక్రమంలో కమిషన్లు కూడా  తీసుకున్నాడు,’ తాజా ఆరోపణలు చేశాడు.

 

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : కేవలం నాల్రోజులే సంక్రాంతి హాలిడేస్.. కానీ 11 సెలవులు ఎక్స్ట్రా
IMD Rain Alert : హిందూ మహాసముద్రంలో మరో తుపాను .. అక్కడ కుండపోత వర్షాలు.. తెలుగు రాష్ట్రాల సంగతేంటి..?