నిన్న సాయంత్రమే మాట్లాడాను.. కానీ ఈరోజు గౌతమ్ రెడ్డి లేరంటే నమ్మలేకపోతున్నాను: టీడీపీ నేత సోమిరెడ్డి

Published : Feb 21, 2022, 10:49 AM IST
నిన్న సాయంత్రమే మాట్లాడాను.. కానీ ఈరోజు గౌతమ్ రెడ్డి లేరంటే నమ్మలేకపోతున్నాను: టీడీపీ నేత సోమిరెడ్డి

సారాంశం

ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి (Mekapati Goutham Reddy) హఠాన్మరణంపై పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. గౌతమ్‌రెడ్డి పార్థీవదేహానికి నివాళులర్పించడానికి ఆస్పత్రికి వద్దకు చేరుకున్న టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (somireddy chandramohan reddy)  భావోద్వేగానికి గురయ్యారు.

ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి (Mekapati Goutham Reddy) హఠాన్మరణంపై పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. పార్టీలకతీతంగా హైదరాబాద్‌ జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి చేరుకుని ఆయనకు నివాళులర్పిస్తున్నారు. గౌతమ్‌రెడ్డి పార్థీవదేహానికి నివాళులర్పించడానికి ఆస్పత్రికి వద్దకు చేరుకున్న టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (somireddy chandramohan reddy) తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. గౌతమ్ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. 

ఆస్పత్రి వద్ద సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ..  ‘నిన్న రాత్రి ఒక నిశ్చితార్థంలో ఇద్దరం కలుసుకన్నాం. అప్యాయంగా నన్ను పలకరించి.. ఆయన తండ్రి సీటు పక్కన కూర్చొపెట్టారు. పార్టీలకు అతీతంగా పనిచేసే వ్యక్తి. సంస్కారం ఉన్న వ్యక్తి.. చదువుకున్న వ్యక్తి.  రెండున్నరేళ్లలో అవతలి పార్టీ వాళ్లకు ఒక్కరికి కూడా కీడు చేయలేదు. ఆయన వివాద రహితుడా నిలిచారు. ఏం చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. 

రాత్రి 7.30 గంటలకు కలిశాను.. ఉదయం 7.30 గంటలకు లేడు అంటే నేను జీర్ణించుకోలేపోతున్నారు. రాష్ట్రం ఒక మంచి వ్యక్తిని కోల్పోయింది. ఆయన మరణం రాష్ట్రానికి తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నాను. చంద్రబాబు నాయుడుకు గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి రానున్నారు. రాత్రి నిశ్చితార్థంలో చాలా యాక్టివ్‌గా ఉన్నాడు. నాకు గౌతమ్ రెడ్డి ఆప్త మిత్రుడు, బంధువు. రాజమోహన్ రెడ్డి, గౌతమ్ రెడ్డిలు చాలా పద్దతైన వ్యక్తులు.. రాత్రి రాజమోహన్ రెడ్డితో చాలా సేపు మాట్లాడం జరిగింది’ అని తెలిపారు. 


 మేకపాటి గౌతమ్ రెడ్డి (Mekapati Goutham Reddy) ఈ రోజు హఠాన్మరణం చెందారు. ఈ ఉదయం గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన గౌతమ్ రెడ్డి చికిత్స పొందుతూ కన్నుమూశారు. వారం రోజుల దుబాయ్ పర్యటన ముగించుకుని నిన్ననే గౌతమ్ రెడ్డి హైదరాబాద్‌కు చేరుకున్నారు. గౌతమ్ రెడ్డికి గుండె పోటు రావడంతో ఆయనను హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. ప్రత్యేక వైద్యుల బృందం చికిత్స అందించినప్పటికీ ఆయన ప్రాణాలను కాపాడలేకపోయారు. గౌతమ్ రెడ్డి మరణించిన విషయాన్ని వైద్యులు ఆయన కుటుంబ సభ్యులకు తెలియజేశారు. దీంతో మేకపాటి కుటుంబంతో పాటు, వైసీపీ శ్రేణులు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. 

గౌతమ్ రెడ్డి 1971 నవంబర్ 2వ తేదీన గౌతమ్ రెడ్డి జన్మించారు. ఆయన మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తనయుడు. గౌతమ్ రెడ్డి  స్వగ్రామం నెల్లూరు జిల్లా మర్రిపాడు మండం బ్రాహ్మణపల్లి. ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్ యూనివర్సిటీలో గౌతమ్ రెడ్డి ఎమ్మెస్సీ పూర్తి చేశారు. వైసీపీ ఆరంభం నుంచి మేకపాటి కుటుంబం వైఎస్ జగన్‌తోనే ఉంది. నెల్లూరు జిల్లా నుంచి పారిశ్రామిక వేత్తగా ఉన్నారు. 

మేకపాటి గౌతమ్ రెడ్డి 2014లో రాజకీయ ప్రవేశం చేశారు. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆత్మకూరు నుంచి వైసీపీ తరఫున బరిలో నిలిచిన గౌతమ్ రెడ్డి విజయం సాధించారు. ప్రస్తుతం వైఎస్ జగన్ కేబినెట్‌లో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. అయితే ఆయనకు గుండెపోటు రావడంతో.. ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే పరిస్థితి విషమించింది. ఆయన మరణవార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు, హైదరాబాద్‌లో ఉన్న వైసీపీ నాయకులు ఆస్పత్రి వద్దకు చేరుకుంటున్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Odisha Governor Kambhampati Hari Babu Speechవిశాఖలో ఘనంగా మహా సంక్రాంతి వేడుకలు| Asianet News Telugu
CM Chandrababu at Naravaripalli నారావారి పల్లి లో గోమాతకి పూజ చేసిన సీఎం చంద్రబాబు| Asianet Telugu