సమీక్ష అడ్డుకుంటే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని చెప్పా: మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

By Nagaraju penumalaFirst Published May 1, 2019, 5:31 PM IST
Highlights

తాను ఈనెల 23న మీడియా సమావేశంలో తాను సమీక్ష పెడతానని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అందులో భాగంగా 30న అధికారులతో బ్రీఫింగ్ ఉందంటూ సమాచారం ఇచ్చానని కానీ అధికారులు రాలేదన్నారు. ఆ ప్రెస్మీట్లో తన సమీక్షను ఎలక్షన్ కమిషన్ అడ్డుకుంటే మంత్రి పదవికి రాజీనామా చేసి సుప్రీం కోర్టును ఆశ్రయిస్తానన్న విషయాన్ని గుర్తు చేశారు. 

అమరావతి: వ్యవసాయ రంగ అనుబంధ శాఖల సమీక్షకు అధికారులు గైర్హాజరుకావడంపై మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. ప్రజల సమస్యలపై సమీక్షలు నిర్వహిస్తే తప్పా అంటూ నిలదీశారు. 

ప్రభుత్వ సమీక్షలను అడ్డుకోవడం ఏ మేరకు సబబు అంటూ ఎన్నికల సంఘంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకున్న ప్రభుత్వమని తాము సమీక్షలు చేయవచ్చునన్నారు. మంత్రులుగా ఉంటూ తాము ఉత్సవ విగ్రహంలా ఉండాలా అంటూ నిప్పులు చెరిగారు. 

మంత్రులు నిర్వహించే సమీక్షలకు హాజరుకావొద్దని ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ లో ఎక్కడా పొందుపరచలేదన్నారు. సీఎం చంద్రబాబు సమీక్షలకు హాజరైన అధికారులకు మెమోలు ఇవ్వడంతో మంత్రుల సమీక్షకు హాజరైతే మరింత ఇబ్బందులు తప్పవనో అధికారులు రాలేదని చెప్పుకొచ్చారు. 

తాను ఈనెల 23న మీడియా సమావేశంలో తాను సమీక్ష పెడతానని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అందులో భాగంగా 30న అధికారులతో బ్రీఫింగ్ ఉందంటూ సమాచారం ఇచ్చానని కానీ అధికారులు రాలేదన్నారు. 

ఆ ప్రెస్మీట్లో తన సమీక్షను ఎలక్షన్ కమిషన్ అడ్డుకుంటే మంత్రి పదవికి రాజీనామా చేసి సుప్రీం కోర్టును ఆశ్రయిస్తానన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇకపోతే తెలంగాణ రాష్ట్రంలో మంత్రి నిరంజన్ రెడ్డి సమీక్షలు నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. 

మంత్రి సమీక్ష అనంతరం ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మీడియాకు బ్రీఫింగ్ ఇచ్చారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి ఒక న్యాయం తమకు ఒక న్యాయమా అంటూ నిలదీశారు. అధికారులు, తాము సమిష్టిగా పనిచేసి వ్యవసాయం దాని అనుబంధ రంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధించామని తెలిపారు. 

భారతదేశంలో వ్యవసాయం అనుబంధ రంగాల్లో 11.2 శాతం అభివృద్ధి సాధిస్తే జాతీయ స్థాయిలో 2.4 శాతం అభివృద్ధి సాధించినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం జీరో అని గుర్తు చఏశారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు కష్టాలు పడాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుందని ఆరోపించారు. 

కరువు కాటకాల్లో ప్రజలు విలవిలలాడాలని భావిస్తోందన్నారు. తుఫాన్ లు వస్తున్నా, కరువులు సంభవిస్తున్నా, అకాల వర్షాలు కురుస్తున్నా తాము సమీక్షలు చేయకుండా తెలుగుదేశం ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకువచ్చేలా వైసీపీ కుట్రపన్నుతోందని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు.  

ఈ వార్తలు కూడా చదవండి
మంత్రి సోమిరెడ్డికి చేదు అనుభవం: సమీక్షకు హాజరుకాని అధికారులు , ఏం చేస్తారోనని ఆసక్తి

click me!