శ్రీకాకుళం జిల్లాలో విషాదం: ఓ ఇంట్లో భారీ విస్ఫోటనం

By narsimha lodeFirst Published May 1, 2019, 5:13 PM IST
Highlights

 శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం యాతపేటలో నాటు బాంబులు పేలి తొమ్మిది మంది గాయపడ్డారు. అడవి పందుల కోసం నాటు బాంబులు తయారు చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకొందని చెప్పారు.


శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం యాతపేటలో నాటు బాంబులు పేలి తొమ్మిది మంది గాయపడ్డారు. అడవి పందుల కోసం నాటు బాంబులు తయారు చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకొందని చెప్పారు.

తొలుత  ఇంట్లో గ్యాస్ సిలిండర్‌ పేలిందని భావించారు. కానీ అగ్నిమాపక సిబ్బంది ఇంట్లో పరిశీలించిన తర్వాత బాంబు పేలుడు వల్లే ఈ ఘటన చోటు చేసుకొందని అధికారులు నిర్ధారించారు. రమణ అనే వ్యక్తి ఈ బాంబులు తయారు చేస్తున్నారు.

ఈ బాంబు పేలుడు కారణంగా ఇరుగు పొరుగు ఇళ్లు కూడ దెబ్బతిన్నాయి.  అగ్నిమాపక సిబ్బంది ఈ ఇంట్లో పరిశీలించారు.  అయితే ఇంట్లో గన్ పౌడర్‌ను అగ్నిమాపక సిబ్బంది గుర్తించారు. 

గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు గాయపడిన వారిలో ఇద్దరు చిన్నారులున్నారు. తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా స్థానిక ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు.
 

click me!