విజయవాడ టెక్కీ శ్వేత చౌదరి ఆత్మహత్య: 'సైబర్ మోసగాడి చేతిలో మోసపోయిందా?

By narsimha lode  |  First Published Jul 4, 2022, 8:21 PM IST

ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన టెక్కీ శ్వేత చౌదరి ఆత్మహత్యకు సైబర్ నేరగాళ్లు  కారణమని పోలీసుల తమ దర్యాప్తులో గుర్తించారు. ఈ విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. రూ. 1.20 లక్షలు పంపితే రూ. 7 లక్షలు చెల్లిస్తామని సైబర్ నేరగాళ్ల మాటలు నమ్మి డబ్బులు పంపి మోసపోయినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ విసయాన్ని ఎన్టీవీ ప్రసారం చేసింది. 



విజయవాడ: ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన Techie  Swtha Chowdary ఆత్మహత్యకు సైబర్ నేరగాళ్లు మోసం చేయడమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.ఈ విషయమై తమ దర్యాప్తులో పోలీసులు గుర్తించారని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ తెలిపింది.ఈ మేరకు ఎన్టీవీ  కథనం ప్రసారం చేసింది.

ఎన్టీఆర్ జిల్లా Jaggayyapet సమీపంలోని చిల్లకల్లు చెరువులో  దూకి టెక్కీ శ్వేత suicide చేసుకుంది. ఈ నెల 2న శ్వేత చౌదరి ఆత్మహత్యక పాల్పడింది.  ఆన్ లైన్ లో ఉండే శ్వేత కు అపరిచిత వ్యక్తి పరిచయమయ్యాడు. రూ. 1.20  లక్షలు చెల్లిస్తే రూ. 7 లక్షలు  ఇప్పిస్తానని చెప్పాడు. అయితే తన వద్ద అంత డబ్బు లేదని శ్వేత అతనికి చెప్పింది. అయితే అతనే ఆమెకు రూ. 50 వేలు చెల్లించాడు.

Latest Videos

undefined

దీంతో మరో రూ. 50 వేలు కలిపి ఆమె లక్ష రూపాయాలు అతడికి పంపింది. దీనికి తోడు మరికొంత డబ్బును కూడా Cyber Cheater  టెక్కీ శ్వేత నుండి  తీసుకున్నారు. ఆమెకు చెప్పినట్టుగా రూ. 7 లక్షలు పంపలేదు. దీంతో తాను మోసపోయినట్టుగా భావించిన టెక్కీ చెరువులో దూకి ఆత్మహత్యుకు పాల్పడిందని పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారని ఎన్టీవీ కథనంలో తెలిపింది. ఆన్ లైన్ లో శ్వేత ఎవరెవరితో చాటింగ్ చేసిందనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 

తాను సైబర్ చీటర్స్ చేతిలో మోసపోవడంతో మనోవేదనక గురై ఆత్మహత్యకు పాల్పడినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. శ్వేత సోషల్ మీడియా ఖాతాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

click me!