సీఎం జగన్ పై సోషల్ మీడియాలో పోస్ట్... సీఐడి ఆఫీసుకి వృద్ధ దంపతులు

By Arun Kumar PFirst Published Aug 8, 2021, 8:55 AM IST
Highlights

ముఖ్యమంత్రి జగన్ కుటుంబానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశాడని ఓ వృద్ధున్ని సీఐడి అధికారులు విచారించారు.

అమరావతి: సోషల్ మీడియాలో వైసిపి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నవారిపై ఏపీ పోలీసులు ఉక్కపాదం మోపుతున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో పోస్టు పెట్టిందని ఇటీవల జ్యోతిశ్రీ అనే యువతిని అరెస్టు చేసి అర్థరాత్రి వరకు స్టేషన్ లో వుంచిన ఘటన మరువకముందే అలాంటిదే మరోటి చోటుచేసుకుంది. సీఎం జగన్ కు వ్యతిరేకంగా పోస్ట్ పెట్టడం కాదు అలాంటి పోస్ట్ ను షేర్ చేసినందుకు వృద్ధ దంపతులు సీఐడి కార్యాయల మెట్లెక్కాల్సి వచ్చింది. 

వివరాల్లోకి వెళితే... గుంటూరు జిల్లా బుడంపాడులో చేరెడ్డి జనార్ధన్(63)-ఝాన్సీరాణి దంపతులు నివాసముంటున్నారు. అయితే ఇటీవల ముఖ్యమంత్రి జగన్ కుటుంబానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఎవరో పోస్ట్ పెడితే దాన్ని జనార్ధన్ షేర్ చేశాడు. దీన్ని గుర్తించిన ఏపీ సిఐడి అధికారులు అతడిని శనివారం గుంటూరు ప్రాంతీయ కార్యాలయానికి పిలిపించి విచారించారు. భార్యతో కలిసి సిఐడి కార్యాలయానికి వచ్చిన అతడిని రాత్రి 7.30కు వరకు విచారించారు.

READ MORE  జగన్ అక్రమాస్తుల కేసు: విజయసాయిరెడ్డికి సిబిఐ కోర్టు నోటీసులు

''నీకు రెడ్డిలంటే కోపమెందుకు? నీకు వారివల్ల ఏమయినా నష్టం జరిగిందా? సోషల్ మీడియాలో సీఎం జగన్, ఆయన కుటుంబం, వైసిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వుండే పోస్టులను షేర్ చేయమని ఎవరైనా చెప్పారా?'' ఇలా సీఐడి అధికారులు ప్రశ్నించినట్లు జనార్ధన్ తెలిపారు. తన భార్యను బయటకు పంపి ఒక్కడినే విచారించారని... రాత్రి వరకు ఆమె బయటే పడిగాపులు కాయాల్సి వచ్చిందన్నారు. తాము ఎవరికీ వ్యతిరేకం కాదని... విచారణ పేరిట తమను వేధించవద్దని వృద్ధ దంపతులు పోలీసులను కోరారు. 

ఇక ఇటీవల సోషల్ మీడియాలో పోస్టు పెట్టిందని జ్యోతిశ్రీ అనే యువతిని అరెస్టు చేసి అర్థరాత్రి వరకు స్టేషన్ లో వుంచడంపై టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత సీరియస్ అయ్యారు. రాష్ట్ర చరిత్రలో మహిళాలోకానికి ఇది చీకటి రోజని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా పోస్టులపై మహిళను అర్థరాత్రి వరకు స్టేషన్ లో వుంచడం రాష్ట్ర చరిత్రలో లేదన్నారు. చిన్నపిల్లలు ఉన్నారనే కనికరం కూడా లేకుండా విచారణ పేరుతో ష్టేషన్ లోనే వుంచడం దారుణమని అనిత మండిపడ్డారు. 

''జగనన్న 14రోజుల రిమాండ్ పథకంతో ముసలీ ముతక, మహిళ అనే బేధం లేకుండా జైల్లో పెడుతున్నారు. మహిళల పోస్టులదాటికి జగన్ రెడ్డి భయపడ్డారని తేలిపోయింది. ప్రతిరోజూ టీడీపీ మహిళలపై, అమరావతి మహిళలపై, ప్రతిపక్ష పార్టీలపై వైసీపీ సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారు. వారిపై ఎన్ని చర్యలు తీసుకున్నారో సీఐడీ, డీజీపీ సమాధానం చెప్పాలి'' అని డిమాండ్ చేశారు. 

''టీడీపీ నేతలను దూషిస్తూ వైసీపీ సోషల్ మీడియాలో ఇబ్బందికరమైన పోస్టింగులపై డీజీపీ, సీఐడీకి టీడీపీ ఫిర్యాదు చేసినా నిందితులను పట్టుకోలేదు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం పౌరస్వేచ్ఛ అని వైసీపీ నేతలు చెప్పింది గుర్తులేదా.? మరి ఇప్పుడు మహిళలు పోస్టులు పెడితే ఎందుకు అరెస్టు చేస్తున్నారు?'' అని అనిత ప్రశ్నించారు.  

  

click me!