విహారయాత్రలో విషాదం.... కడప జిల్లాలో నలుగురు బెంగళూరు వాసులు మృతి

Arun Kumar P   | Asianet News
Published : Aug 08, 2021, 07:58 AM IST
విహారయాత్రలో విషాదం.... కడప జిల్లాలో నలుగురు బెంగళూరు వాసులు మృతి

సారాంశం

సరదాగా విహారయాత్రకు వెళ్లిన ఓ కుటుంబంలో విషాదం నిండింది. కడప జిల్లాలోని ఓ జలాశయంలో మునిగి ముగ్గురు చిన్నారులతో సహ మరో వ్యక్తి చనిపోయాడు. 

కడప: కుటుంబంతో కలిసి సరాదాగా విహారయాత్రకు వెళ్లడమే ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. కడప  జిల్లాలోన వెలిగల్లు ప్రాజెక్ట్ సమీపంలోని గండి మడుగులో నలుగురు బెంగళూరు వాసులు గల్లంతయ్యారు. వీరిలో ముగ్గురు చిన్నారులే వుండటం మరింత విషాదకరం.  

వివరాల్లోకి వెళితే... కర్ణాటక రాజధాని బెంగళూరులో నివాసముండే ఓ కుటుంబం సరదాగా విహారయాత్ర చేస్తోంది. పదిమంది కుటుంబసభ్యులు ఇలా వివిధ ప్రాంతాల్లో విహరిస్తూ చిత్తూరు జిల్లా వాల్మీకిపురంలో బంధువుల వద్దకు వచ్చారు. అక్కడ మరో పది మందితో కలిసి గాలివీడు మండలం వెలిగల్లు ప్రాజెక్ట్ సమీపంలోకి గండి మడుగు వద్దకు వెళ్లారు.  

read more  గుంటూరు: జూనియర్‌తో సీనియర్ విద్యార్ధి గొడవ.. సినీఫక్కిలో వెంటాడి కొట్టుకున్న ఇరువర్గాలు

ఈ క్రమంలోనే చిన్నారులు , మహ్మద్‌ హంజా(12), ఉస్మాన్‌ ఖానమ్‌(11), మహ్మద్‌ హఫీజ్‌(10)లు సరదాగా నీటిలోకి దిగారు. ప్రమాదవశాత్తు ముగ్గురు నీటిలో మునిగిపోగా వారిని కాపాడే ప్రయత్నం చేసిన తాజ్ మహ్మద్(40) కూడా నీటమునిగారు. ఇలా కుటుంబసభ్యులు తమ కళ్లెదుటే నీటమునుగుతున్నా ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఆ కుటుంబం ఉండిపోయింది.  

ఈ ఘటనపై సమాచారం అందుకున్న లక్కిరెడ్డిపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్ల సాయంతో గల్లంతయిన వారికోసం గాలింపు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.   

 

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు