టిటిడికి ఇంకెతమంది ఛైర్మన్లవుతారో ?

Published : Sep 28, 2017, 09:30 PM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
టిటిడికి ఇంకెతమంది ఛైర్మన్లవుతారో ?

సారాంశం

ఇప్పటికి సోషల్ మీడియా కావచ్చు లేదా మీడియా కావచ్చు కనీసం నలుగురికి ట్రస్ట్ బోర్డ్ ఛైర్మన్ పదవిని కట్టబెట్టేసింది.

తిరుమల తిరుపతి దేవస్ధానం పాలకమండలికి ఇంకా ఎంతమంది ఛైర్మన్లు వస్తారో తెలీటం లేదు. పాలకమండలి కాలపరిమితి అయిపోయి సుమారు నాలుగు మాసాలవుతున్నా దాని నియామకంపై చంద్రబాబునాయుడు ఇంకా ఏవో లెక్కలేసుకుంటున్నారు. ఆ లెక్కలేంటో ఎవరికీ అర్ధంకాదు. తాన లెక్కలేంటో చంద్రబాబు ఎవరికీ చెప్పరు? దాంతో ఆశావహులు పెరిగిపోతున్నారు. నేతల్లో అయోమయం నెలకొంటోంది.

దానికితోడు సోషల్ మీడియాలో ఎవరికి అవకాశం ఉంటే వారు తమ పేర్లు రాయించేసుకుంటున్నారు. ఈ విధంగా ఇప్పటికి సోషల్ మీడియా కావచ్చు లేదా మీడియా కావచ్చు కనీసం నలుగురికి ట్రస్ట్ బోర్డ్ ఛైర్మన్ పదవిని కట్టబెట్టేసింది. మొదటగా నెల్లూరు జిల్లాకు చెందిన మజీ ఎంఎల్ఏ బీద మస్తాన్ రావు. తర్వాత గాలి ముద్దుకృష్ణమనాయుడు, ఆ తర్వాత నందమూరి హరికృష్ణ. ఇటీవలే మదనపల్లికి చెందిన సిఎం రవిశంకర్. తాజాగా పుట్టా సుధాకర్ యాదవ్. మధ్యలో ఎంపిలు మురళీ మోహన్, రాయపాటి సాంబశివరావు ప్రయత్నాలు, తిరస్కారాలు. ట్రస్టుబోర్డు నియామకంలో జాప్యం జరిగేకొద్దీ ఇంకెంతమందిని సోషల్ మీడియా  ఛైర్మన్లు చేసేస్తుందో ఏమో?

PREV
click me!

Recommended Stories

Pawan Kalyan Visits Nanded Gurudwara: నాందేడ్ గురుద్వారా సందర్శించిన పవన్ కళ్యాణ్| Asianet Telugu
Arasavalli Rathasapthami: అరసవల్లిలో 80 ఫీట్ రోడ్డులో మెగా సూర్యనమస్కారాలు | Asianet News Telugu